సాగుకు సన్నాహం

ABN , First Publish Date - 2022-05-28T04:54:36+05:30 IST

పాలమూరు ఉమ్మడి జిల్లాలో సాగుకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రియదర్శిని జూరాల, సరళా సాగర్‌, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, సంగంబండ, కోయిలసాగర్‌, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు, ఆరు వేల పైచిలుకు చెరువులు, 2.50 లక్షల వరకు ఉన్న బోరుబావుల ఆధారంగా సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

సాగుకు సన్నాహం
నర్వ మండలంలో దుక్కి దున్నుతున్న రైతు

సాగుకు సన్నాహం

మొదలైన వానాకాలం పంటల ప్రక్రియ

20.38 లక్షల ఎకరాల్లో వేసేందుకు ఏర్పాట్లు

విత్తనాలన్నీ ప్రైవేట్‌లో కొనాల్సిందే

2.04 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని నివేదికలు

నకిలీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు

రుణ ప్రణాళిక కాగితాలకే పరిమితం


 పాలమూరు ఉమ్మడి జిల్లాలో సాగుకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రియదర్శిని జూరాల, సరళా సాగర్‌, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, సంగంబండ, కోయిలసాగర్‌, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు, ఆరు వేల పైచిలుకు చెరువులు, 2.50 లక్షల వరకు ఉన్న బోరుబావుల ఆధారంగా సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ వానాకాలంలో మొత్తం 20,38,795 ఎకరాల్లో పంటలు వేయడానికి ప్రణాళిక సిద్ధమైంది. అత్యధికంగా పత్తి సాగుకు ప్రాధాన్యమిస్తే, ఆ తర్వాత వరి, కంది, మొక్కజొన్న పంటలు వేసేందుకు రెడీ అయ్యారు. అవసరమైన మేర విత్తనాలు, ఎరువుల కొరత లేదని వ్యవసాయ అధికారులు చెబుతుండగా, రుణమాఫీ పథకం గందరగోళంగా మారిన నేపథ్యంలో రైతులకు  రుణ మద్దతు మాత్రం కొరవడింది.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


 ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాగు ప్రణాళిక తయారైంది. ఈ సీజనలో అధికంగా పత్తి సాగుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రాజెక్టులు, బోరుబావుల కింద వరి వేసేందుకు సిద్ధమయ్యారు. నాగర్‌కర్నూల్‌, జోగు లాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లా ల్లో ఎక్కువగా పత్తికి ప్రాధాన్యమిస్తుండగా, వనపర్తి జిల్లాలో వరి వేయనున్నారు. నారాయణపేట, నాగర్‌క ర్నూల్‌ జిల్లాల్లో వరిని ద్వితీయ ప్రాధాన్యంగా సాగు చేయనుండగా, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో కందులు వేయనున్నారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, జొన్న, ఆముదం పంటలు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. తొలకరి చినుకులు పడగానే పంటలు వేసేందుకు సంసిద్ధులయ్యారు.


విత్తనాల కొరత లేకుండా చర్యలు

వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల కొరత ఉండకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నిల్వలు అందుబాటులోకి వచ్చాయని వ్యవ సాయ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన పత్తి, వరి, కంది విత్తనాలతో పాటు జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఇతర పంటలకు సంబంధించి ప్రణాళిక ప్రకారం 2,04,788 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు డీలర్లకు ఇప్పటికే నిల్వలు చేరా యని అంటున్నారు. పత్తి విత్తనాలకు సంబంధించి ఎలాంటి కొరత ఉండదని తెలిపారు. సబ్సిడీలపై కేవలం పశుగ్రాసం, జీలుగ విత్తనాలు మినహా ఇతర రకాలేవీ అందుబాటులో లేకపోవడంతో ప్రెవేట్‌లోనే రైతులు విత్త నాలు సేకరించాల్సి వస్తోంది. విత్తనాల కృత్రిమ కొరత సృష్టిం చకుండా, నకిలీలు మార్కెట్లోకి రాకుండా జిల్లా స్థాయిల్లో ఇప్ప టికే ఎస్పీలు, వ్యవసాయ, రెవె న్యూ అధికారుల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాట య్యాయి. తనిఖీలు కొనసా గుతుండడంతో నకిలీలకు కొంతమేర చెక్‌ పడ్డటయ్యింది.


అందని రుణాలు

రాష్ట్రంలో రెండోసారి 2018లో ప్రభుత్వం కొలువుదీరాక రుణమాఫీ అమలును దశలవారీగా చేపట్టారు. దాంతో రైతులకు పంట రుణాల మద్దతు కరువైంది. రూ.లక్షలోపు రుణాల్లో మొదటి విడతలో రూ.25 వేల రుణాలకు, తర్వాత రూ.50 వేల రుణాలకు, ఆతర్వాత రూ.75 వేల రుణాలకు నిధులు విడుదల చేయడంతో బ్యాంకుల్లో రైతులకు ఇబ్బంది ఏర్పడింది. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మొత్తాన్ని మినహాయించుకోగా, ఇంకా వడ్డీల బాపతు, ఇతర పెనాల్టీలు కలిపి భారీగా రుణమున్నారని, రైతులు డి ఫాల్టర్లు అని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుండడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ప్రభుత్వం ఇస్తోన్న మాఫీ మొత్తం ఎటుపోతోందని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ ఇచ్చినా ఇంకా బాకీనే చూపించడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడం, డిఫాల్టర్లుగా రికార్డుల్లో రాస్తుండడంతో భవిష్యత్‌లోనూ రుణ పరపతి కోల్పోతున్న దారుణమైన స్థితిని రైతాంగం ఎదుర్కొంటోందని వాపోతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచింకకపోతే ప్రభుత్వం ఇచ్చిన రుణ మాఫీ పథకానికి విలువలేకుండా పోతుందని, దీనిని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవతీసుకోవాలనే సూచనలు రైతాంగం నుంచి వస్తున్నాయి. 

Updated Date - 2022-05-28T04:54:36+05:30 IST