Jun 23 2021 @ 00:52AM

పాత్ర కోసం ప్రిపరేషన్‌

బాలీవుడ్‌ కథానాయిక కట్రీనా కైఫ్‌ షూటింగ్‌కు సిద్ధం అవుతున్నారు. విజయ్‌ సేతుపతి సరసన ఆమె నటిస్తున్న ‘మేరీ క్రిస్‌మస్‌’ చిత్రం షూటింగ్‌లో త్వరలో పాల్గోనున్నారు. పుణేలో ఏప్రిల్‌లోనే షూటింగ్‌ ప్రారంభించాల్సి ఉండగా కరోనాతో నిలిచిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వడంతో త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కట్రీనా భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. కొత్త తరహాగా ఉండడంతో కట్రీనా కైఫ్‌ చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ పర్యవేక్షణలో ముందస్తుగా సిద్ధమవుతున్నారు. దీనికోసం ఆమె చాలా సమయం వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ చదువుతూ మంచి అవుట్‌పుట్‌ కోసం తన పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొంటున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే దర్శకుడిని అడిగి నివృత్తి చేసుకుంటున్నారు. పూర్తి క్లారిటీతో సెట్‌లోకి అడుగుపెట్టాలనే లక్ష్యంతో కట్రీనా ఉన్నారు. 90 నిమిషాల నిడివితో ‘మెర్రీ క్రిస్‌మస్‌’ చిత్రం తెరకెక్కుతుండడం విశేషం.