నల్లగొండలో ప్రేమోన్మాది అరెస్టు

ABN , First Publish Date - 2022-08-11T06:26:37+05:30 IST

ప్రేమ పేరుతో యువతిని వేధించి ఆమెపై హ త్యాయత్నం చే సిన నిందితుడిని నల్లగొండ పోలీసులు అరె స్టు చేసి రిమాండ్‌కు పంపారు.

నల్లగొండలో ప్రేమోన్మాది అరెస్టు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

 యువతిపై హత్యాయత్నం చేసిన నిందితుడు 

నల్లగొండ అర్బన, ఆగ స్టు 10: ప్రేమ పేరుతో యువతిని వేధించి ఆమెపై హ త్యాయత్నం చే సిన నిందితుడిని నల్లగొండ పోలీసులు అరె స్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఎస్పీ రెమారాజేశ్వరి వివరాలు వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని అబ్బాసియా కాలనీకి చెందిన మీసాల రోహిత, జిల్లాకేంద్రం సమీపంలోని పానగల్‌కు చెందిన బాధితురాలు ఇద్దరు ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. రోహిత డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌ అయ్యాడు. బాధితురాలు డిగ్రీ పూర్తిచేసి కాంపిటీషన పరీక్షలకు ప్రిపేర్‌ అవుతుంది. డిగ్రీ చదివే క్రమంలోనే అమ్మాయిని ప్రేమపేరుతో వేధించాడని ఫిర్యాదులు ఉన్నాయి. రోహిత డిగ్రీ ఫెయిల్‌ అయి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా బాధితురాలిని ప్రేమ పేరు తో వేధిస్తున్నాడు. అమ్మాయి ఒప్పుకోకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్‌ కార్యాలయం పార్కు వద్దకు రోహిత తన స్నేహితుడి ద్వారా బా ధితురాలికి ఫోన చేయించాడు. బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి పార్కు వ ద్దకు వెళ్లి కొద్దిసేపు అందరూ కలిసి మాట్లాడుకున్నారు. తర్వాత బాధితురాలితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు రోహిత ఆమెను పక్కకు తీసుకెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై అకస్మాత్తుగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంట వచ్చిన స్నేహితులు తీవ్ర గాయాలైన బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. పరిస్థి తి సీరియ్‌సగా ఉండడంతో ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా రు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రమే జిల్లా కేంద్ర శివారులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

నిందితుడికి శిక్ష పడేలా చూస్తాం

ఈ కేసును డీఎస్పీ స్థాయి సీనియర్‌ అధికారికి విచారణ బాధ్యతలు అప్పగిం చా మని ఎస్పీ తెలిపారు. సాక్ష్యాధారాలు పకడ్బందీగా సేకరించి నిందితుడికి సకాలంలో శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. బాధితురాలికి, కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామన్నారు. జిల్లాలో షీటీం సమర్థవంతంగా పనిచేస్తుందని, ఈ సంవత్సరంలో 202 పిటీషన్లు అందాయన్నారు. అందులో 28 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 500లకు పైగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జి ల్లాలో 1300ప్రాంతాల్లో హాట్‌స్పాట్లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పోలీసుల నిఘా, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో, రద్దీ ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను, మహిళలను వేధిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ తెలిపారు. ఆడ పిల్లలను, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధింపులకు గురైతే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 9963393970 ఫోన నెంబర్‌కు ఫోన చేసి వివరాలు చెబితే తక్షణమే పోలీసు లు చర్యలు తీసుకుంటారన్నారు.


Updated Date - 2022-08-11T06:26:37+05:30 IST