గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న చక్కటి ప్రేమకథా చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. రణదీర్ హీరోగా, నందినిరెడ్డి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తుదిదశ చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు ఎం. వినయ్‌బాబు మాట్లాడుతూ ‘‘చిత్రీకరణ చివరిదశలో ఉంది. ప్రేమలోఉన్న ప్రతి జంట చూడాల్సిన చిత్రం ఇది. మార్చి నెలలో విడుదల చేస్తామ’న్నారు. చిత్ర నిర్మాత బీసు చందర్‌గౌడ్ మాట్లాడుతూ ‘వినయ్‌బాబు చెప్పిన కథ నచ్చి మా అబ్బాయి రణధీర్‌ని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాం. సాంకేతికంగా సినిమా పై స్థాయిలో ఉంటుంది. ఖర్చుకు వెనుకాడకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో సినిమా తెరకెక్కించాం’ అన్నారు. ‘దర్శకుడు నా నుంచి మంచి నటన రాబట్టుకున్నారు’ అని రణధీర్ చెప్పారు. సుమన్, సూర్య, అమిత్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్. నివాస్ సంగీతం అందిస్తున్నారు.