అకాల వర్షం.. జనం హర్షం

ABN , First Publish Date - 2021-04-13T05:55:45+05:30 IST

మండలంలో తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు సోమవారం కురిసిన అకాల వర్షంతో ఉపశమనం పొందారు.

అకాల వర్షం.. జనం హర్షం
వర్షంతో జలమయమైన లోతట్టు ప్రాంతం

రావికమతం, ఏప్రిల్‌ 12: మండలంలో తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు సోమవారం కురిసిన అకాల వర్షంతో ఉపశమనం పొందారు. రోజురోజుకూ ఎండలు నిప్పుల కొలిమిలా మండుతుండడంతో ఉదయం 10 గంటలకే ప్రజలు గడప దాటి బయటకు రాలేకపోతున్నారు. దీనికితోడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. వాతావరణం మారిపోయి చల్లని గాలులు వీచాయి. దీంతో మండల ప్రజలు సేదదీరారు. ఈ వర్షం ఎండ వేడిమి నుంచి కొంచెం ఊరటనిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-13T05:55:45+05:30 IST