జిల్లాలో అకాల వర్షం

ABN , First Publish Date - 2022-01-13T07:02:45+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున అకాల వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం రైతులను కూడా కష్టాల పాలు చేసింది. తేమశాతం తక్కువగా ఉందనే కారణంతో సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ము ద్దయింది.

జిల్లాలో అకాల వర్షం
యాదగిరిగుట్టలో కురుస్తున్న వర్షం

పేట మార్కెట్‌లో తడిసిన 40బస్తాల ధాన్యం

పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

యాదాద్రి క్షేత్రంలో పనులకు స్వల్ప ఆటంకం


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున అకాల వర్షం  కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం రైతులను కూడా కష్టాల పాలు చేసింది. తేమశాతం తక్కువగా ఉందనే కారణంతో సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ము ద్దయింది. సూమారు అరగంటకుపైగా కురిసిన వర్షంతో ధాన్యం పూర్తి గా తడిసింది. మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన మహిళా రైతు గుడిపూరి యశోద మంగళవారం మార్కెట్‌కు సూమారు 40బస్తాల సాంబమసూరి ధాన్యం తీసుకొచ్చింది. ఖరీదుదారులు క్విం టాకు రూ.1,400లు ధర ఖారారు చేశారు. ధర తక్కువ రావడంతో ధా న్యం అమ్మ కుండా బుధవారం మంచి ధర వస్తే విక్రయిద్దామని ధాన్యా న్ని మార్కెట్‌ ఆవరణలో ఆరబోసింది. బుధవారం తెల్లవారుజామున ఆకాల వర్షం రావడంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. సగంధాన్యం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండిన పంట కళ్లేదుటే కొట్టు కుపోవడంతో యశోద కన్నీటిపర్యంతమైంది. సూర్యాపేట పట్టణంలోని మురుగు కాల్వలు వర్షానికి పొంగిపొర్లాయి. మోతె మండ లం రాఘ వాపురంలోని కోళ్ల షెడ్డు ఈదురు గాలులకు కూలిపోయింది. వరినాట్లు వేసేందుకు వచ్చిన కూలీలు వర్షం కురు స్తుండడంతో షెడ్డు పక్కన ఉన్నారు. పై కప్పుకూలి మీద పడడంతో గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఇప్పటికే కాత సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్న కంది రైతులకు ఈ వర్షం మరింత నష్టం కలిగించింది. కోతకు సిద్ధంగా ఉన్న కంది చేలలో, కోసి దూడాలు వేసిన కంది కట్టలపైన కంది కాయలు తడిసి మొలకెత్తి నాణ్యత దెబ్బ తింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాదగిరిగుట్టలో భారీ వర్షం కురిసి అరగంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించింది. యాదాద్రి క్షేత్రంలో వర్షం కారణంగా గండి చెరువు ప్రాంతంలోని నిర్మాణ ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో మోటార్లతో నీటిని తోడుతున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ పుట్టింగులలోనికి చేరిన వరద నీటిని అధికారులు తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తుండటంతో భక్తులు వర్షంలోనే నృసింహుడి దర్శనానికి వెళ్లారు.

 యాదాద్రి కొండపై ఉన్న రెండో ఘా ట్‌రోడ్‌లో వర్షపు నీరు ప్రవ హించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కనగల్‌, శాలిగౌరారం మండలాల్లో వర్షం కురిసింది. పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫ రాకు అంతరాయం కలిగింది.భువనగిరి జూనియర్‌ కళాశాల మైదా నం లో ఏర్పాటు చేసిన రైతుబజారు తాత్కాలిక షెడ్లు అకాల వర్షానికి కుప్పకూలిపోయాయి. క్రితం రూ.లక్ష వెచ్చించి 92తాత్కాలిక షెడ్లతో రైతుబజారు ఏర్పాటు చేశారు. రూ.2లక్షల విలువైన కూరగాయలు నష్ట పోయామని బాధితులు తెలిపారు. మార్కెటింగ్‌ డీఎంవో సబితి, మార్కె ట్‌ చైర్మన్‌ నల్లమాస రమేశ్‌ షెడ్లను పరిశీలించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మోసరు వర్షం కురిసింది. అర్వపల్లి, వలిగొండ మండ లాల్లో చిరు జల్లులు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 11.6 మిల్లీ మీటర్లు, సూర్యాపేట జిల్లాలో 1.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - 2022-01-13T07:02:45+05:30 IST