అన్నదాతకు ‘అకాల’ భయం!

ABN , First Publish Date - 2021-10-18T05:56:19+05:30 IST

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పు లు అన్నదాతల్లో ఆందోళన నెలకొంటుంది. కారుమబ్బులు కమ్ముకువచ్చి అకాల వర్షాలు రైతన్నలను భయాందోళనకు గురి చేస్తోంది.

అన్నదాతకు ‘అకాల’ భయం!
ఎల్లారెడ్డిలో నేలకొరిగిన వరిపంట

వరుస వర్షాలతో రైతుల ఆందోళన

కోత దశకు చేరుకున్న వరి

నూర్పిడికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, సోయా, పప్పుదినుసు పంటలు

తడిసిపోతున్న పంటల ఉత్పత్తులు

ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు

ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్ర నష్టం

కామారెడ్డి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పు లు అన్నదాతల్లో ఆందోళన నెలకొంటుంది. కారుమబ్బులు కమ్ముకువచ్చి అకాల వర్షాలు రైతన్నలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే సోయా, మొక్కజొన్న పంటలు చేతికి రావడం, నూర్పిడి దశలో ఉండడంతో దిగుబడులు పంట చేన్లలోనే ఉన్నాయి. ఒకవైపు వరిపంట చేతికొచ్చి కోతదశలో ఉన్నాయి. కొన్నిచోట్ల కోసిన పంట ప్రధాన రహదారులపై కుప్పలుగా పోసి ఆరబెడుతున్నారు. అకాల వర్షాలతో ఆరబెట్టిన పంట ఉత్పత్తులు తడిచి ముద్దావుతాయోనని రైతులు అయోమయంలో ఉన్నారు. రైతుల పంటల ఉత్పత్తులకు సంబంధించి ఏ ఒక్క కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వాలు ప్రారంభించకపోవడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నా యంటూ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో రైతులు మరింత ఆందోళకు గురవుతున్నారు. కొనుగో లు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుల నుంచి డిమాండ్‌ వెల్లువెత్తుతోంది.

కలవరపెడుతున్న మబ్బులు

ప్రతీ వానాకాలం సీజన్‌లో పంటలు కోత దశకు వచ్చే సమయంలో అకాల, వడగండ్ల వర్షాలు కురువడం సర్వసాధారణం. సరిగ్గా కోతల సమయంలోనే అకాల వర్షాలు కురుస్తుండడంతో ప్రతి ఏటా వరి, సోయా, మొక్కజొన్న ఇతర పంటల ఉత్పత్తులు తడిసిపోవడంతో రైతన్నలు నష్టపోతూ వస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఈ సీజన్‌లో భారీ వర్షాలతో రైతన్నలు వరదల తాకిడికి పంటలు నీటమునగగా ఇటీవల కురిసిన గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో పంటలు కొట్టుకుపోయాయి. మరోసారి తుఫాన్‌ వస్తే చేతికోచ్చిన పంటలు నీటి పాలవుతాయోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో రెండురోజుల నుంచి కారుమబ్బులు కమ్మేస్తుండడంతో ఎక్కడా అకాల వర్షాలు కురుస్తుయోనని రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. ఇప్పటికే బాన్సువాడ, బీర్కూరు, నాగిరెడ్డిపేట, లింగంపేట, మాచారెడ్డి తదితర మండలాల్లో కురిసిన అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కోతకు వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు.

నష్టపోతున్న రైతన్నలు

జిల్లాలో ప్రతీ వానాకాలం, యాసంగి సీజన్లలో అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చే సమయంలో అకాల, వడగండ్ల వర్షాలతో పంటచేన్లలోనే వరి నేలకొరగడం, కేం ద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసిపోతుండడంతో నాణ్యత లేదనే కారణంతో వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీ వ్రంగా నష్టపోతున్నారు. ఇలా వరి రైతులేకాకుండా సోయా, మొక్కజొన్న, కంది, పెసర, జను ము పంటలు సైతం నూర్పిడి దశలోనే అకాల వర్షాలతో నీటి పాలవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇలా ప్రతీ సీజన్‌లో పంటలు చేతికొచ్చే సమయంలోనే ప్ర కృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిస్తుండడంతో రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. ఇలా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వాలు నాలుగేళ్లుగా పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపో తూ పంటల సాగులో అప్పుల పాలవుతున్నారు.

కొనుగోళ్లకు ఏర్పాట్లు

వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లకు ఆయా జిల్లాల అధి కార యం త్రాంగం ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జా రీ చేసింది. దీంతో జిల్లాలో పౌరసరాఫరాల, స హకార, ఐకేపీ, మార్కెటింగ్‌శాఖల ఆధ్వర్యంలో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యా ప్తంగా 340 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందు లో పీఏసీ ఎస్‌ ఆధ్వర్యంలో 310, ఐకేపీ ఆధ్వర్యంలో 20, మార్కెటింగ్‌ ఆధ్వర్యంలో 10 కేంద్రాలను ఏర్పాటు చే యనున్నారు. ఈ సీజన్‌లో 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఏ గ్రేడ్‌కు 1960,బీ గ్రేడ్‌ క్వింటాల్‌కు రూ.1940 చెల్లించి కొనుగోలు చేయనున్నారు. అకాల వర్షాలు కురుసే అవకాశాలు ఉండడంతో కేం ద్రాల వద్ద ధాన్యం తడిసిపోకుండా ఉండేం దుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్‌లు, ధాన్యం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు.

Updated Date - 2021-10-18T05:56:19+05:30 IST