నవజాత శిశువులు తమ చేతులు, కాళ్లను మెల్లగా కదిలిస్తుంటే ఎవరికైనా చూడముచ్చటేస్తుంది. అయితే ఆ శిశువు చేయి ఎంత చిన్నగా ఉందంటే... తండ్రి వెడ్డింగ్ రింగ్... ఆ పసిపాప చేతికి బ్రేస్లెట్గా మారిపోయింది. పోపీ కుక్ అనే ఈ శిశువు జన్మతహా తక్కువ బరువుతో జన్మించింది. ఇంతేకాదు ఆ శిశువు అరుదైన వ్యాధితో బాధపడింది. లూసీ, మ్యార్ కుక్ల కుమార్తె పోపీ 450 గ్రాముల బరువుతో జన్మించింది. పైగా నెలలు నిండకుండానే అంటే 19 వారాల ముందుగానే పోపీ జన్మించింది. తరువాత 107 రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంది. పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది.
బ్రెయిన్ సిస్ట్, గుండెలో రంధ్రం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడింది. ఆ శిశువు శరీరం ఎంత సున్నితంగా ఉందంటే.. ముట్టుకుంటే గాయపడుతుంది. ఇన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న పోపీకి ఇప్పడు ఆరేళ్లు. ఈ సందర్భంగా పోపీ తల్లి మీడియాలో మాట్లాడుతూ ‘ 25 వారాల ప్రగ్నెన్సీ తరువాత నాకు బ్లడ్ప్రెజర్ పెరిగింది. దీంతో 25 వారాలకే డెలివరీ చేయాల్సివచ్చింది. పాప పుట్టిన పది రోజుల వరకూ మేము దానిని చూడలేకపోయాం. అయితే ఇన్నాళ్లు గడిచాక పోపీ పూర్తిగా మారిపోయింది. దానికి లెక్కలు చేయడం అంటే ఎంతో ఇష్టం. బార్బీ బొమ్మలతో ఆడుకోవడంమంటే మరీ ఇష్టం. పోపీ మాట్లాడుతూ ... నేను బాల్యంలో అన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని నాకే తెలియదు. ఇప్పుడు ఇంత పొడుగ్గా మారాను’ అని ముద్దుముద్దుగా చెప్పింది.