Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 24 Jun 2022 10:06:20 IST

Prema Desam హీరో రీ ఎంట్రీ..?

twitter-iconwatsapp-iconfb-icon

‘ప్రేమ దేశం’ (Prema Desam) సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇందులో ఓ హీరోగా నటించిన అబ్బాస్ మళ్ళీ తెలుగు తెరపై కనిపించబోతున్నాడట. ‘ప్రేమ దేశం’ సౌత్‌లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అబ్బాస్, వినీత్ (Vineeth), టబు (Tabu) ప్రధాన పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ (A R Rehaman) సంగీతం అందించిన ఈ సినిమాకు కదిర్ (Kadir) దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు, సీన్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తమిళంలో ఒరిజినల్ వెర్షన్ ‘కాదలన్ దేశం’ (Kadalan Desam) చిత్రానికి ఇది తెలుగు డబ్బింగ్. అయినా స్ట్రైట్ మూవీగానే ప్రేక్షకులు ఆదరించారు. అంతేకాదు, హిందీతో పాటు మిగతా సౌత్ భాషలలో కూడా విడుదలై భారీ హిట్ సొంతం చేసుకుంది.

కాలేజీ నేపథ్యంలో సరికొత్త కథ కథనాలతో రూపొందించిన ‘ప్రేమ దేశం’ ఆ తర్వాత ఎన్నో సినిమాలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ (Abbas) మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే, గత కొన్నేళ్ళుగా అబ్బాస్‌కు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఎట్టకేలకు మళ్ళీ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Prema Desam హీరో రీ ఎంట్రీ..?

మాచో హీరో గోపీచంద్ (Gopichand) శ్రీవాస్ (Srivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ముందు సీనియర్ హీరో రాజశేఖర్‌ను కీలక పాత్రకోసం తీసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత జగపతి బాబును కూడా ఈ సినిమా కోసం సంప్రదించారట. కానీ, వారి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ ప్లేస్‌లో అబ్బాస్ అయితే బావుంటుందని మేకర్స్ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో మంచి అవకాశం ఎదురుచూస్తున్న అబ్బాస్..ఈ మూవీ ఆఫర్‌కు ఒకే చెప్పినట్టు సమాచారం. ఇదే నిజమైతే రీ ఎంట్రీ తర్వాత అబ్బాస్ సినీ కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement