ఇండియాలో ఐపీఎల్ 2021.. ప్రీతిజింటా స్పందనేంటో తెలుసా?

ABN , First Publish Date - 2021-03-08T02:18:54+05:30 IST

కరోనా నేపథ్యంలో ఐపీఎల్ గత సీజన్‌ను యుఏఈలో నిర్వహించిన బీసీసీఐ ఈసారి మాత్రం ఇక్కడే నిర్వహించాలని

ఇండియాలో ఐపీఎల్ 2021.. ప్రీతిజింటా స్పందనేంటో తెలుసా?

ముంబై: కరోనా నేపథ్యంలో ఐపీఎల్ గత సీజన్‌ను యుఏఈలో నిర్వహించిన బీసీసీఐ ఈసారి మాత్రం ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. వచ్చే నెల 9 నుంచి మే 30 వరకు ఈ మెగా టోర్నీ జరగనుండగా, దేశవ్యాప్తంగా ఆరు వేదికలపై మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ నేడు అధికారికంగా వెల్లడించింది. 


ముంబైలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నప్పటికీ వేదికల్లో దానికి కూడా చోటిచ్చింది. మిగతా ఐదింటిలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా ఉన్నాయి. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల తర్వాత బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహయజమాని ప్రీతిజింటా ఆనందంగా ట్వీట్ చేసింది. ఐపీఎల్‌ను ఈసారి భారత్‌లో నిర్వహిస్తున్నందుకు, ఒక్కో జట్టుకు నాలుగు వేదికలు మాత్రమే కేటాయించి ప్రతి ఒక్కరి రక్షణ గురించి ఆలోంచినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొంది. బయోబబుల్ అనేది చాలా కష్టమైన పని, అయినప్పటికీ మనం కలిసి సాధిస్తామని, పూర్తి సురక్షితంగా, అత్యద్భుతంగా ఐపీఎల్ 2021 జరుగుతుందని ప్రీతి చెప్పుకొచ్చింది. 

Updated Date - 2021-03-08T02:18:54+05:30 IST