Abn logo
Sep 18 2020 @ 12:24PM

హమ్మయ్యా.. బయటకు వస్తున్నా: ప్రీతీ జింటా

Kaakateeya

తెలుగులో రెండు సినిమాల్లో నటించిన బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రీతి జింటా కొద్ది రోజులుగా వెండితెరకు దూరమైంది. అయితే సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోంది. అలాగే ఐపీఎల్ సమయంలో కూడా సందడి చేస్తోంది. `కింగ్స్ లెవెన్ పంజాబ్` సహ భాగస్వామి అయిన ప్రీతి `ఐపీఎల్-13` సీజన్ కోసం కొన్ని రోజుల క్రితమే దుబాయ్ వెళ్లింది. ఏడు రోజుల క్వారంటైన్ పీరియడ్‌ను పూర్తి చేసుకోబోతోంది. 


శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠకు గురవుతోంది. తాజాగా ఓ వీడియోను ప్రీతి ఇన్‌స్టా‌లో షేర్ చేసింది. `నాకు చాలా ఉత్కంఠగా ఉంది. రేపటితో నేను క్వారంటైన్‌ను పూర్తి చేసుకోబోతున్నా. ఇప్పటికి నాలుగు సార్లు చేయించుకున్న కోవిడ్ టెస్టుల్లో నెగిటివ్ అని వచ్చింది. అయినా ఐపీఎల్ ప్రోటోకాల్ ప్రకారం మరోసారి శాంపిల్ ఇచ్చా. ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన`ని ప్రీతి పేర్కొంది. 



Advertisement
Advertisement
Advertisement