అంబులెన్సులో సుఖ ప్రసవం

ABN , First Publish Date - 2020-10-23T08:03:40+05:30 IST

గర్భిణీని నెలలు నిండడంతో 108 అంబు లెన్సులో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా సామర్లకోట చేరేసరికి ఆమెకు నొప్పులు ఎక్కువవ్వడంతో సామర్లకోటలో రోడ్డుపక్కన అంబులెన్సు వాహనాన్ని నిలిపివేశారు.

అంబులెన్సులో సుఖ ప్రసవం

  • తల్లీ బిడ్డ క్షేమం

సామర్లకోట, అక్టోబరు 22 : గర్భిణీని నెలలు నిండడంతో 108 అంబు లెన్సులో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా సామర్లకోట చేరేసరికి ఆమెకు నొప్పులు ఎక్కువవ్వడంతో సామర్లకోటలో రోడ్డుపక్కన అంబులెన్సు వాహనాన్ని నిలిపివేశారు. అంబులెన్సు ఈఎంటీ ఈశ్వరరావు, పైలట్‌ నగేష్‌లు ఆమెకు సుఖ ప్రసవానికి కృషిచేయడంతో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. రిస్క్‌ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ అంబులెన్సు సిబ్బంది చేసిన కృషిని పలువురు అభినందించారు. తల్లీ బిడ్డలను మెరుగైన చికిత్స కోసం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అదే అంబులెన్సులో తరలించారు. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన పోలిమాటి సునీతకు ఈ సంఘటన జరిగింది.

Updated Date - 2020-10-23T08:03:40+05:30 IST