Abn logo
Sep 28 2021 @ 02:26AM

24 ఏళ్ల ఆ యువతికి ఏడాది క్రితమే పెళ్లి.. మూడు నెలల గర్భవతి.. రాత్రి 10 గంటలకు ఇంటి ముందు నడుస్తోంటే.. ఇద్దరు యువకులు వచ్చి..

నైట్ డ్యూటీ కోసం భర్త ఇంటి నుంచి బయటికి వెళ్లాడు, ఆ తరువాత కడుపుతో ఉన్న భార్య బయట కాసేపు వాకింగ్ చేస్తుండగా ఇద్దరు ఆకతాయిలు అమె వెంటపడ్డారు. ఆ తరువాత ఏం జరిగిందంటే..


బీహార్‌ రాజధాని పట్నాలో ఓ పెట్రోలియం కంపెనీలో పని చేసే ఉద్యోగి ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల క్రితం అతని భార్య గర్భవతి అని తెలిసింది. ఓ రాత్రి ఆ భర్త నైట్ డ్యూటీ కోసం ఆఫీస్ వెళ్లాడు. ఆ తరువాత గర్భవతి అయిన ఆ భార్య బయట వాకింగ్ చేస్తుండగా ఇద్దరు ఆకతాయిలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఒంటరిగా ఉన్న ఆమెను కిడ్నాప్ చేసి దగ్గరే ఉన్న పొలంలోకి లాక్కొని వెళ్లారు. వారిద్దరిలో ఒకడు తన మరో స్నేహితుడికి కబురు చేశారు. 


వారు ముగ్గురూ ఆమెను లొంగతీసుకునేందుకు గర్భవతి అని చూడకుండా చితకబాదారు. ఆ తరువాత వరుసగా అమెపై అత్యాచారం చేశారు. తమ మృగవాంఛ తీర్చుకున్న తరువాత ఆమెను తీసుకెళ్లి రైల్వే పట్టాల మీద పడుకోబెట్టి పారిపోయారు. కొద్దిసేపు తరువాత ఆమెకు స్పృహ వచ్చాక ఆమె సహాయం కోసం గట్టిగా కేకలు వేసింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఆమెను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చారు.


ఆమె చెప్పిన సమాచారం ప్రకారం పోలీసులు విచారణ చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ప్రత్యేకంమరిన్ని...