8 నెలల గర్భిణి.. మాతృత్వాన్ని ఆస్వాదించాల్సింది పోయి ఆత్మహత్యాయత్నం.. అసలేమైందని పోలీసులు ఆమెను అడిగితే..

ABN , First Publish Date - 2022-07-18T23:06:07+05:30 IST

ఆ మహిళ పెళ్లికి ముందే అత్యాచారానికి గురైంది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తే ఆమెను వివాహం చేసుకున్నాడు.

8 నెలల గర్భిణి.. మాతృత్వాన్ని ఆస్వాదించాల్సింది పోయి ఆత్మహత్యాయత్నం.. అసలేమైందని పోలీసులు ఆమెను అడిగితే..

ఆ మహిళ పెళ్లికి ముందే అత్యాచారానికి గురైంది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తే ఆమెను వివాహం చేసుకున్నాడు.. దాంతో ఆమె తను పెట్టిన కేసును వెనక్కి తీసుకుంది.. అప్పట్నుంచి ఆమె పట్ల వారి ప్రవర్తన మారిపోయింది.. ఆమెపై వేధింపులు ప్రారంభించారు.. దీంతో ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ఆ మహిళ ఓ సరస్సులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

పెళ్లయిన కొద్ది రోజులకే భర్త గురించి తెలిసిందో షాకింగ్ నిజం.. అసలు విషయాన్ని అత్తకు చెప్పిన కోడలు.. ఆ తర్వాత..


హర్యానాలోని కర్నాల్‌కు చెందిన బాధిత మహిళ ఆదివారం సాయంత్రం సరస్సులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ తన భర్త, అత్తమామలపై తీవ్ర ఆరోపణలు చేసింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని తాను కానని చెప్పి భర్త తనను మూడు నెలల కిందట ఇంటి నుంచి బయటకు గెంటేశాడని, డీఎన్ఏ పరీక్ష చేయించుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆ మహిళ తెలిపింది. అయినా భర్త, అత్తమామలు తనను నమ్మడం లేదని ఆ మహిళ ఆరోపించింది. 


మూడు నెలలుగా భర్తకు దూరంగా ఉంటున్నానని చెప్పింది. భర్త తనను బయటకు గెంటేసి, మరో మహిళతో ఉంటున్నాడని తెలియడంతో ఆమె భర్త దగ్గరకు వెళ్లి గొడవ చేసింది. భర్త ఆమెను తిరస్కరించడంతో వేరే దారి లేక ఆత్మహత్యాయత్నం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ భర్తను, అత్తమామలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడుతున్నారు. 

Updated Date - 2022-07-18T23:06:07+05:30 IST