గర్భవతిగా ఉండి కరోనా విధులు.. మహిళా డీఎస్పీపై ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2021-04-21T22:30:35+05:30 IST

కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రప్రభుత్వాలు లాక్‌డౌన్ కూడా ప్రకంటించాయి. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం...

గర్భవతిగా ఉండి కరోనా విధులు.. మహిళా డీఎస్పీపై ప్రశంసల వర్షం

ఛత్తీస్‌గఢ్: కరోనా అందరినీ వణికిస్తున్న వేళ మహిళా పోలీసు అధికారి గర్భవతిగా ఉండి విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందించడానికి డాక్టర్లు కూడా భయపడుతున్నారు. కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రప్రభుత్వాలు లాక్‌డౌన్ కూడా ప్రకంటించాయి. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం లాక్‌డౌన్ విధించారు. దీంతో పోలీసులు లాటీలు పట్టుకుని రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్నారు. డీఎస్పీ శిల్ప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ మండే ఎండలో గల్లీల్లో తిరుగుతూ ప్రజలకు కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు. అందరూ మాస్కు ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలని, లాక్‌డౌన్ సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వేడుకుంటున్నారు.

 

అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ దీపాన్షు కబ్రా ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దంతేవాడ డీఎస్పీ శిల్పా సాహు గర్భవతి అయినప్పటికీ తన టీమ్‌తో విధుల్లో బిజీగా ఉన్నారని ట్యాగ్ చేశారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. శిల్పాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఆమెను ‘హీరో’గా అభివర్ణిస్తున్నారు.

Updated Date - 2021-04-21T22:30:35+05:30 IST