రాష్ట్రంలో గ్రామీణ పండుగలకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-05-24T06:28:46+05:30 IST

సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో గ్రామీణ పండుగలకు అధిక ప్రాధాన్యం, గుర్తింపు లభించిందని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

రాష్ట్రంలో గ్రామీణ పండుగలకు ప్రాధాన్యం
టేకుమట్ల చౌడమ్మ తల్లి జాతరలో డోలు వాయిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

 మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేటరూరల్‌ / పెన్‌పహాడ్‌, మే 23: సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో గ్రామీణ పండుగలకు అధిక ప్రాధాన్యం, గుర్తింపు లభించిందని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మండలంలోని టేకుమట్ల గ్రామశివారులో చౌడమ్మజాతరలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం గ్రామీణ పండుగలకు, సంస్కృతీ, సాంప్రదాయాలకు నెలవన్నారు. గ్రామీణ ప్రాంతంలో పండుగలతో ఐక్యత ఉంటుందని, స్నేహభావంతో పండుగలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. గ్రామాలు, పట్టణాలు అభి వృద్ధే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు.  అదేవిధంగా టేకుమట్లలో ఎంపీ లింగయ్యయాదవ్‌తో కలిసి రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణపనులకు, కేసారం గ్రామంలో సంత్‌నిరంకారీ భవన నిర్మాణానికి శంకుస్ధాపన మంత్రి చేశారు. అనంతరం గాంధీనగర్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీని శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి బిక్షం, వైస్‌ఎంపీపీ శ్రీనివాసనాయుడు, సర్పంచ్‌ పిండిగ పద్మ, నాయకులు చాంద్‌పాషా, రఫీ, సునీల్‌రెడ్డి, వెంకన్న, జానకిరాములు, సైదులు పాల్గొన్నారు. అదేవిధంగా పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న లింగ మంతులస్వామి, సౌడమ్మ జాతరను మంత్రి గుంటకండ్ల జగ దీష్‌రెడ్డి ప్రారంభించారు. జాతరకు మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి హాజరయ్యారు.

Updated Date - 2022-05-24T06:28:46+05:30 IST