పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-05-29T09:07:24+05:30 IST

రాష్ట్రంలో పారిశ్రామికా భివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పౌరస రఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ..

పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం

విజయవాడ, మే 28: రాష్ట్రంలో పారిశ్రామికా భివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పౌరస రఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. ‘మన పాలన- మీసూచన’లో భాగంగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఐవీప్యాలెస్‌ నుంచి మంత్రి, కలెక్టర్‌ ఇంతియాజ్‌ పాల్గొన్నారు. జిల్లాలో కిందటేడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు అనుమతించిన 653 పరిశ్రమల ద్వారా రూ.5.750 కోట్ల పెట్టుబడులు, అందులో 42,793 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. 

Updated Date - 2020-05-29T09:07:24+05:30 IST