హరితహారంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-01-25T03:49:20+05:30 IST

నూతన మున్సి పల్‌ చట్టానికి లోబడి తయారు చేసిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో జిల్లాలో హరితహారంలో వెనుకబడిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌లు, అధికారులతో పల్లె, పట్టణ ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై సమావే శం నిర్వహించారు.

హరితహారంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 24: నూతన మున్సి పల్‌ చట్టానికి లోబడి తయారు చేసిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో జిల్లాలో హరితహారంలో వెనుకబడిన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌లు,  అధికారులతో పల్లె, పట్టణ ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై సమావే శం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ  2022-23 ఆర్థిక సంవత్సరానికి అభివృద్ధికి సంబంధించిన ప్రతి పాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతోపాటు పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల్లో పన్ను లు వసూలు చేయడంలో అధికారుల పనితీరు అభి నందనీయమని, ఇదే తరహాలో ప్రస్తుత ఆర్థిక సం వత్సరంలో కూడా పనిచేయాలని పేర్కొన్నారు. ఆక్ర మిత కట్టడాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామ న్నారు. టీఎస్‌బీపాస్‌ ద్వారా నూతన కట్టడాలకు అనుమతి ఇవ్వాలని, ఈ కార్యక్రమం ద్వారా అక్రమ కట్టడాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామ న్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో హరితహారంలో వెను కబడిన ప్రాంతాలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తామన్నారు.  

Updated Date - 2022-01-25T03:49:20+05:30 IST