ఆయారాం.. గయారాం

ABN , First Publish Date - 2022-07-01T05:18:58+05:30 IST

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి మొదలుకావడంతో

ఆయారాం.. గయారాం

  • ముందస్తు ఎన్నికల ‘వేడి’
  • బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
  • టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ కార్పొరేటర్లు
  • కాంగ్రెస్‌లోకి బడంగ్‌పేట్‌ మేయర్‌!


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, జూన్‌30) : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి మొదలుకావడంతో ఆయా పార్టీల్లో రాజకీయ అలజడి మొదలైంది. భవిష్యత్తు రాజకీయ అవకాశాల కోసం ఆయా పార్టీల్లో నేతలు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేస్తున్నారు. కాంగ్రె్‌సకు రాజీనామా చేసి కొన్నాళ్లుగా తటస్థంగా ఉన్న చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సుదీర్ఘమంతనాలు తరువాత బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. విశ్వేశ్వర్‌రెడ్డి చేరిక వల్ల  ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో బీజేపీ మరింత బలం పుంజుకునే అవకాశం ఉంది. స్థానిక బీజేపీ నేతలు కూడా విశ్వేశ్వర్‌రెడ్డి రాకను స్వాగతిస్తున్న తరుణంలో ఆ పార్టీకి మరో రూపంలో దెబ్బతగిలింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఆరంభానికి ముందే ఆ పార్టీకి టీఆర్‌ఎస్‌ ఝలక్‌ ఇచ్చింది. బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్న  సమయంలో బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతోపాటు తాం డూరులోని కౌన్సిలర్లు టీఆర్‌ఎ్‌సలో చేరిపోయారు. తాండూరు మున్సిపాలిటీలోని బీజేపీ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న నర్కుల సింధూజ, సీపీఐ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న అసీఫ్‌ తమ పార్టీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాండూరు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ మాజీ కౌన్సిలర్‌ నరేందర్‌గౌడ్‌ కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఆర్‌ పార్టీలో చేరారు. ప్రజా సంక్షేమం కోసమే టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోని హస్తినాపురం డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ బానోతు సుజాతనాయక్‌, రాజేంద్రనగర్‌ బీజేపీ కార్పొరేటర్‌ అర్చనప్రకాష్‌ కూడా టీఆర్‌ఎ్‌సలో చేరారు. గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యేల సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. పార్టీలో చేరిన కార్పొరేటర్‌ సుజాతనాయక్‌తో పాటు ఆమె భర్త రాంచందర్‌నాయక్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు శ్రీనివా్‌సనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచరులు వీరిని కాంగ్రె్‌సలో రప్పించే యత్నాలు చేశారు. అయితే  కార్పొరేటర్‌ భర్త రాంచందర్‌నాయక్‌ మంత్రి కేటీఆర్‌ క్లాస్‌మెట్స్‌ కావడం, చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి చంద్రశేఖర్‌రెడ్డికి సత్సాసంబఽఽంధాలు ఉండడంతో వారు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. 


టీఆర్‌ఎ్‌సకు కాంగ్రెస్‌ షాక్‌!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఆరంభానికి కొన్నిగంటల ముందు బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకుని జోష్‌లో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి కాంగ్రెస్‌ షాక్‌ ఇచ్చింది. బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ పారిజాతారెడ్డిని తిరిగి తమ గూటికి రప్పించుకునే విషయంలో సఫలమైంది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో కాం గ్రెస్‌ నుంచి విజయం సాధించిన పారిజాతారెడ్డిని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తనవైపు తిప్పుకుని ఆమెను మేయర్‌గా చేసింది. అయితే స్థానిక నేతలతో ఆమెకు పొసగక పోవడంతో తిరిగి కాంగ్రె్‌సలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ నాయకులతో మంతనాలు జరుపుతున్న మేయర్‌ భర్త నర్సింహారెడ్డి గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ తరుపున మహేశ్వరం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మేయర్‌ పారిజాతారెడ్డితోపాటు మరికొందరు కార్పొరేటర్లు రేపో మాపో కాంగ్రె్‌సలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే దీనిపై మేయర్‌ వర్గీయులు మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

Updated Date - 2022-07-01T05:18:58+05:30 IST