IMD issued red alert:ఆంధ్రాతోపాటు పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు

ABN , First Publish Date - 2022-09-14T14:38:31+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం అతి భారీవర్షాలు(heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణశాఖ( Indian Meteorological Department)(ఐఎండీ) తాజాగా...

IMD issued red alert:ఆంధ్రాతోపాటు పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం అతి భారీవర్షాలు(heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణశాఖ( Indian Meteorological Department)(ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్(Andhra), మహారాష్ట్ర, సిక్కిం, గుజరాత్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్,ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్,జార్ఖండ్, నాగాలాండ్, గోవా రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బుధవారం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్(weather bulletin of the Indian Meteorological Department) లో వచ్చే మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయి.


కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో బుధవారం భారీవర్షాలు కురిసే అవకాశమున్నందున ఐఎండీ అధికారులు అలర్ట్ ప్రకటించారు.భారీవర్షాల వల్ల శ్రీకాకుళం, చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై వరదనీరు నిలిచింది.ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. చాలా రోడ్ల జలమయం అయ్యాయి. రత్నాచలంలో ఇళ్లు వరదనీటిలో మునిగాయి.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్, కుమాన్ ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో అతి భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.(red alert issued) మహారాష్ట్రలోని ముంబయి, థానే, సింధూదుర్గ్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఎల్లోఅలర్ట్(yellow alert) జారీ చేశారు. మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వచ్చే 5 రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశముందని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.మహారాష్ట్రలోని ముంబయి, రాయ్ గడ్, రత్నగిరి, థానే, పాల్ఘార్ జిల్లాల్లో వచ్చే 5రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. 


Updated Date - 2022-09-14T14:38:31+05:30 IST