ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసే ముందు..!

ABN , First Publish Date - 2020-08-15T05:30:00+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం నెలకొని ఉన్న సమయంలో సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఏది నిజమో, ఏది అబద్ధమో వినియోగదారులు తేల్చుకోలేకపోతున్నారు...

ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసే ముందు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం నెలకొని ఉన్న సమయంలో సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఏది నిజమో, ఏది అబద్ధమో వినియోగదారులు తేల్చుకోలేకపోతున్నారు. అలాంటి సమాచారానికి అడ్డుకట్ట వేయడానికి ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్‌-19కు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసేముందు మీకు అలర్ట్‌ రూపంలో ఒక సందేశం కనిపిస్తుంది. అందులో ‘కరోనాకు సంబంధించిన సమాచారం కోసం కొవిడ్‌-19 ఇన్‌ఫర్మేషన్‌ హబ్‌ను ఎంచుకోండి’ అని చూపిస్తుంది. రెండోది ఆ 

ఆర్టికల్‌కు సంబంధించిన ఒరిజినల్‌ సోర్స్‌ వివరాలను తెలియజేస్తుంది. మూడోది ఫేస్‌బుక్‌లో ఆ సమాచారం ముందుగా ఎప్పుడు షేర్‌ అయిందో చూపిస్తుంది. అప్పటికీ మీరు ఆ పోస్ట్‌ను షేర్‌ చేయాలనుకుంటే కంటిన్యూ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. లేదంటే గోబ్యాక్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.


Updated Date - 2020-08-15T05:30:00+05:30 IST