బీపీ చూసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2020-10-01T10:20:17+05:30 IST

ఆస్పత్రులకు వెళ్లి, బీపీ చూయించుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, లేదంటే బీపీ రీడింగ్‌లో

బీపీ చూసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కృష్ణ


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), సెప్టెంబరు 30: ఆస్పత్రులకు వెళ్లి, బీపీ చూయించుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, లేదంటే బీపీ రీడింగ్‌లో తేడాలు వచ్చే అవకాశం ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ సూచించారు. రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌, ఇండియా హైపర్‌ టెన్షన్‌ కంట్రోల్‌ ఇనిషియేటివ్‌ వారు బీపీ కొలిచే విధానం, తీసుకునే జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్లను కృష్ణ బుధవారం  తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీ చూసుకునేందుకు వెళ్లినప్పుడు ప్రశాంతంగా ఉండాలన్నారు. పాదాలు నేల మీద సమాంతరంగా ఉండేలా చూసుకోవాలన్నారు.


అప్పుడే కచ్చితమైన రీడింగ్‌ వస్తుందన్నారు. పీహెచ్‌సీలకు వచ్చే 30 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ చెకప్‌ చేయాలన్నారు. ఈ స్టిక్కర్లను అన్ని పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లు, ఎన్‌సీడీ కార్నర్లు, సివిల్‌ ఆస్పత్రులలో అతికించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ సునీత, 104 సేవల జిల్లా సమన్వయకర్త వేణుగోపాల్‌రెడ్డి, ఇండియా హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌ ఇనిషియేటివ్‌ ప్రతినిధి డాక్టర్‌ అబ్దుల్‌ వషీ, హెల్త్‌ ఎడ్యుకేటర్లు రాజగోపాలాచారి, నాగరాజు, సుభా్‌షచంద్ర, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T10:20:17+05:30 IST