Abn logo
Apr 19 2021 @ 00:06AM

అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

ఆదిలాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌18: అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారి కాంతారావు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని తిరుమల పెట్రోల్‌బంక్‌ ఎదురుగా పలు విన్యాసాలు ప్రదర్శించారు. అగ్ని ప్రమాదం సంభవించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అగ్ని ప్రమాదాల నుంచి తప్పించుకునే యత్నాల ను కళ్లకు కట్టినట్లు ప్రదర్శనల ద్వారా చూపించారు. వ్యాపారస్థులు, గృహ నిర్మాణదారులు తమ సంస్థలను ఏర్పాటు చేసే ముందుగా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారుల అనుమతులు కూడా తప్పకుండా తీసుకోవాలని ఆయన సూచించారు. ఇందులో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement