Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించాలి

దర్శి, డిసెంబరు 4 : కరోనా సోకకుండా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సూ చించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శనివారం పట్టణంలోని వ్యాపా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు.  దుకాణాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. భౌతికదూరం పాటించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. వ్యాపారులు తప్పనిసరిగా దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొత్త వ్యక్తుల సంచారాన్ని తెలుసుకోవడానికి సీసీ కెమేరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో దర్శి సీఐ భీమానాయక్‌, ఎస్సై ఏ చంద్రశేఖర్‌, వ్యాపారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement