జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

ABN , First Publish Date - 2020-04-03T07:26:48+05:30 IST

లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ సమయంలో పనిచేస్తున్న ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌, వెబ్‌ మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని ప్రీ ప్రెస్‌ ఎడిటర్స్‌...

జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

ప్రీ ప్రెస్‌ ఎడిటర్స్‌, జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ సమయంలో పనిచేస్తున్న ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌, వెబ్‌ మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని ప్రీ ప్రెస్‌ ఎడిటర్స్‌, జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ తాహెర్‌ రొమానీ డిమాండ్‌ చేశారు. ‘‘లాక్‌డౌన్‌తో మీడియాకు యాడ్‌ రెవెన్యూ పడిపోయింది. పత్రికలు పేజీల సంఖ్యను కుదించాయి. చిన్న పత్రికల కార్యకలాపాలు నిలిచిపోయాయి. కొన్ని యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొంది’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-03T07:26:48+05:30 IST