Advertisement
Advertisement
Abn logo
Advertisement

పీఆర్సీ నివేదిక ఇస్తేనే చర్చించగలం: బొప్పరాజు

అమరావతి: పీఆర్సీ నివేదిక ఇస్తేనే చర్చించగలమని చెప్పామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు తెలిపారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడమే కాకుండా.. నివేదికలోని వివరాలను కూడా చెప్పడం లేదని విమర్శించారు. సీఎం జగన్ ప్రకటనతో పీఆర్సీ నివేదిక ఇస్తారని ఆశతో వెళ్లామని తెలిపారు. అధికారుల దగ్గరైనా పీఆర్సీ నివేదిక ఉందా..? అని బొప్పరాజు అనుమానం వ్యక్తం చేశారు. సలహాదారు చంద్రశేఖర్‌ కూడా అధికారులు చెప్పిందే చెప్పారని బొప్పరాజు తెలిపారు. 


కమిటీ సభ్యులను పీఆర్సీ నివేదిక అడిగామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. వచ్చేవారం సీఎంతో అన్ని అంశాలపై చర్చ జరుగుతుందని భావిస్తున్నామని, ఇతర సంఘాల గురించి తమను అడగొద్దని, నివేదిక ఇచ్చాక వారి గురించి మాట్లాడుతామని వెంకట్రామిరెడ్డి చెప్పారు.


పీఆర్సీ నివేదికపై అధ్యయనం చేసేందుకు కార్యదర్శుల కమిటీతో సమావేశమయ్యామని, పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భావిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. కొత్త పీఆర్సీపై అభిప్రాయాలు తీసుకునే అధికారం కమిటీకి లేదని సూర్యనారాయణ అన్నారు.

Advertisement
Advertisement