నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు:
పాలకొండ: ప్రభుత్వం పీఆర్సీపై జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పాలకొండలో ధర్నా నిర్వ హించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ నాయకులు రంగాచారి, ఈశ్వరరావు, లిల్లీ పుష్పనాఽథం, సంపత్‌కుమార్, భరత్‌భూషణ్‌రాజు, బుచ్చియ్య మాట్లాడుతూ పీఆర్సీని రద్దు చేయాలని, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలోశ్రీనివాసపట్నాయక్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఉద్యోగుల ఉద్యమానికి సీపీఎం మద్దతు
పాలకొండ రూరల్: పీఆర్సీకోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న ఉద్య మానికి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం మండల కన్వీనర్ దావాల రమణారావు తెలి పారు.ఈ మేరకు పాలకొండలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అనంతరం పీఆర్సీపై కరపత్రాన్ని ఆవిష్కరిం చారు. కార్య క్రమంలో సీపీఎం నాయకులు దూసి దుర్గారావు, ఎస్.మజ్జియ్య, కాద రాము, రమేష్ పాల్గొన్నారు. కాగా ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి మునిసిపల్ కార్మికుల సమ్మె నిర్వహించ నున్నట్లు రమణారావు తెలిపారు. ఈ మేరకు నగర పంచాయతీ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేశారు.