పీఆర్‌సీ జీవోల ప్రతుల దహనం

ABN , First Publish Date - 2022-01-19T05:26:46+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్‌సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానిక టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద మంగళవారం జీవో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు.

పీఆర్‌సీ జీవోల ప్రతుల దహనం
గూడూరు :ప్రభుత్వ జీవోల ప్రతులను తగులబెడుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు

గూడూరు, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్‌సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానిక టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద మంగళవారం  జీవో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న హెచ్‌ఆర్‌ఏను తగ్గించారన్నారు. అలాగే పీఆర్‌సీని కూడా మధ్యంతర భృతి కన్నా తక్కువ ఇవ్వడం దుర్మార్గపు చర్య అన్నారు. నాయకులు చిరంజీవి, సుధీర్‌, రవి, రవూఫ్‌, సుబ్రమణ్యంరాజు, అనీల్‌కుమార్‌, శివకుమార్‌, శివరామిరెడ్డి  పాల్గొన్నారు.

సూళ్లూరుపేట : స్థానిక తహసీల్దారు కార్యాలయ ప్రాంగణంలో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య నేతలు, ఉపాధ్యాయులు పీఆర్‌సీ ప్రతులను దహనం చేశారు. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య స్థానిక కన్వీనర్‌ గోపీనాథ్‌రావు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వీజే రాజశేఖర్‌, కె. ప్రభాకర్‌, బీటీఏ నేత కె. మునస్వామి, ఓ. శ్రీనివాసులు, వెంకటస్వామి, సునీల, వెంకటరత్నమ్మలతోపాటు పెద్ద ఎత్తు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

నాయుడుపేట :  స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట అన్ని ఉపాధ్యాయ సంఘా ల నాయకులు పీఆర్‌సీ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కంజర్ల  శేఖర్‌ మాట్లాడుతూ పాత హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను కొనసాగించి, కొత్త హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను రద్దుచేయాలని అన్నారు.  ఇకనైనా ప్రభుత్వం స్పందించి కొత్త పీఆర్‌సీ జీవోను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

చిల్లకూరు : ఉపాధ్యాయులు స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద ప్రభుత్వ పీఆర్‌సీ జీవోలను తగులబెట్టారు. ఈ పీఆర్‌సీని ఎట్టి పరిస్థితిల్లో ఒప్పుకోబోమన్నారు. కార్యక్రమంలో మురళీ మోహన్‌, గోపి, శివాజీ, రాజశేఖర్‌, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

వెంకటగిరి(టౌన్‌) : స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద నేతలు, ఉపాధ్యాయులు పీఆర్‌సీ జీవో ప్రతులను  దహనం చేసి నిరసన తెలిపారు. ఏపీ ఉపాధ్యా సంఘాల సమాఖ్య జిల్లా కో చైర్మన్‌ తాళ్లురు శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కుమార స్వామి, ఉదయ్‌కుమార్‌, కె. సుబ్రమణ్యం, నాగమోహన్‌, రామ్మోహన్‌ రెడ్డి, సర్వేశ్వర రావు, దూడల పెంచలయ్య పాల్గొన్నారు. 

రాపూరు : ఉపాధ్యాయులు, పెన్షనర్లు  స్థానిక మండల వనరుల కేంద్రం వద్ద  నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం బజారుసెంటర్‌ వద్దకు ర్యాలీగా  చేరు కొని బజారువీధి నడిబొడ్డున జీవో ప్రతులను కాల్చి బూడిదచేశారు.

చిట్టమూరు : ఉపాధ్యాయులు స్థానిక ఎంఆర్‌సీ భవనం వద్ద ప్రతులను దహనం చేశారు. ఐఆర్‌ కన్నా 8శాతం పీఆర్‌సీ తగ్గించి ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికే దక్కిందని నిరసన తెలిపారు.

పెళ్లకూరు : స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద ఉద్యోగ, ఉపాధ్యా యులు  పీఆర్సీ ప్రతులను దహనం చేశారు.  ఫ్యాప్టో మండల బాధ్యులు బి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. నాయకులు జానా హరి, ఎం. గురునాథం, ఎ. శ్రీనివాసులు, పి. రమేష్‌, వి. చిన్నబాబు, ఎస్‌కె చెంచురాజ, ఈ. సురేష్‌  పాల్గొన్నారు. 

తడ : ఫ్యాప్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన  తెలిపారు. సాయంత్రం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద  పీఆర్‌సీ జీవో ప్రతులను  తగులబెట్టారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌. బాబు, ఉస్మాన్‌బాషా,  గంగాధరం, ప్రదీప్‌, సుధాకర్‌, చెంగయ్య, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. స్థానిక తహసీల్దారు రామయ్య సంఘీభావం తెలిపారు. 

కోట : ఫ్యాప్టో ప్రతినిఽధులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో అంబేద్కర్‌ విగ్రహం వద పీఆర్‌సీ జీవోల ప్రతులను తగలబెట్టారు. చీకటి జీవోలను వెనక్కుతీసుకోవాలని హెచ్చరించారు. 




Updated Date - 2022-01-19T05:26:46+05:30 IST