పీఆర్సీ బకాయిలను ఏకమొత్తంగా చెల్లించాలి: టీఎస్పీటీఏ డిమాండ్

ABN , First Publish Date - 2022-02-23T14:23:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన రెండు నెలల పీఆర్సీ బకాయిలను 18 వాయిదాల్లో చెల్లింపులు చేయాలని...

పీఆర్సీ బకాయిలను ఏకమొత్తంగా చెల్లించాలి: టీఎస్పీటీఏ డిమాండ్

హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన రెండు నెలల పీఆర్సీ బకాయిలను 18 వాయిదాల్లో చెల్లింపులు చేయాలని ఆదేశించడం సమంజసం కాదని, తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఏక మొత్తంగా చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్పీటీఏ)రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, పిట్ట రాజయ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు నిధులు కేటాయిస్తున్నారని, కానీ ప్రభుత్వ యంత్రాంగం నడవడానికి ప్రాణవాయువు అయిన ఉద్యోగులకు చెందిన స్వల్ప బకాయిల చెల్లింపులకు నిధులు కేటాయించక పోవడం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 


18 వాయిదాల్లో చెల్లింపులకు ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరమని, తెలంగాణ మొత్తం దేశానికే ఆదర్శం అని చెబుతున్న ముఖ్యమంత్రి, రెండు నెలల బకాయిలను ఏక మొత్తంగా చెల్లించలేని దుస్థితి దాపురించిందని దేశంలోని ప్రజలు అవహేళనలు చేస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవం, పౌరుషాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి దీనిపై పునర్ ఆలోచన చేయాలని ఉపాధ్యాయ సంఘం నేతలు  కోరారు. 


Updated Date - 2022-02-23T14:23:55+05:30 IST