వైభవంగా రుద్రహోమం

ABN , First Publish Date - 2021-01-27T06:40:53+05:30 IST

స్వామివారి జన్మనక్షత్రం ఆరుద్ర పురస్కరించుకుని మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి రుద్రహోమం మంగళవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా రుద్రహోమం

ఐ.పోలవరం, జనవరి 26: స్వామివారి జన్మనక్షత్రం ఆరుద్ర పురస్కరించుకుని మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి రుద్రహోమం మంగళవారం వైభవంగా నిర్వహించారు.  ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామలకుమార్‌ ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రహోమ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థానం చైర్మన్‌ పెన్మెత్స కామరాజు(వాసురాజు), ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ  స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు యనమండ్ర సుబ్బారావు, పర్యవేక్షకులు కఠారి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T06:40:53+05:30 IST