జేడీయూ మంత్రి జమాఖాన్ ప్రార్థనలు
అజ్మీర్ (రాజస్థాన్): జేడీయూ నాయకుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ దేశానికి తదుపరి ప్రధానమంత్రి కావాలని కోరుతూ బీహార్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి, జేడీయూ నాయకుడు జమాఖాన్ అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రార్థనలు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు వచ్చిన మంత్రి జమాఖాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.‘‘నితీష్ కుమార్ తదుపరి ప్రధాని అవ్వాలి అనేది దేశం మొత్తం కోరుకుంటోంది.ఈ విషయమై ఖ్వాజా గరీబ్ నవాజ్‌ని ప్రార్థించాను, నితీష్ కుమార్‌కి బీహార్ మాత్రమే కాకుండా మొత్తం దేశం పగ్గాలు ఇవ్వాలి, తద్వారా దేశం మొత్తంలో శాంతి,సోదరభావం నెలకొంటుంది’’అని బీహార్ మైనారిటీ సంక్షేమ మంత్రి అన్నారు.
నితీష్ కుమార్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన మొదటి జేడీ(యు) నాయకుడు జమా ఖాన్ కాదు. అంతకుముందు పార్టీ సీనియర్ నాయకుడు కేసీత్యాగి, జేడీ(యు) పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ ఉపేంద్ర కుశ్వాహా లు కూడా నితీష్ ప్రధాని కావడానికి అన్ని లక్షణాలున్నాయి’’ అని చెప్పారు. ‘‘నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థి కాదు. అతను 2024 లో ప్రధాన మంత్రి అయ్యే రేసులో లేరు. మా ఎన్‌డిఎ నాయకుడు నరేంద్ర మోదీ. అయితే నితీష్ కుమార్ ప్రధానమంత్రి కావడానికి కావలసిన అన్ని లక్షణాలున్నాయి.’’ అని గత నెలలో జరిగిన జేడీ(యు) జాతీయ కౌన్సిల్ సమావేశం తర్వాత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు.తన పార్టీ సహచరులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన నితీష్ కుమార్ తాను ప్రధానిగా ఎందుకు ఉండాలి? ఈ విషయంపై తనకు ఆసక్తి లేదంటూ వ్యాఖ్యానించారు.