Prayagraj Violence: పోలీసుల అదుపులో సూత్రధారి జావెద్ అహ్మద్

ABN , First Publish Date - 2022-06-11T21:46:35+05:30 IST

ప్రయాగ్‌రాజ్ అల్లర్ల సూత్రధారి జావెద్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రయాగ్‌రాజ్ ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు.

Prayagraj Violence: పోలీసుల అదుపులో సూత్రధారి జావెద్ అహ్మద్

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్ అల్లర్ల సూత్రధారి జావెద్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రయాగ్‌రాజ్ ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటన వెనక మరింత మంది సూత్రధారులు ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులపై రాళ్లు రువ్వేందుకు సంఘ విద్రోహశక్తులు చిన్నారులను ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. 29 ముఖ్యమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, గ్యాంగ్‌స్టర్, ఎన్ఎస్ఏ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం ప్రార్థనల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, షహరాన్‌పూర్ సహా నాలుగు నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసులు, అధికారులపై రాళ్లు రువ్వారు. 


ఈ కేసులో 70 మంది పేర్లను నిందితులుగా చేర్చామని, పేర్లు తెలియని మరో 5వేల మంది నిందితులుగా ఉన్నారని ఎస్సెస్పీ అజయ్ కుమార్ తెలిపారు. వీరిందరిపైనా గ్యాంగ్‌స్టర్, ఎన్ఎస్ఏ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిందితుల్లో కొందరు ఎంఐఎంకి చెందిన వారు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో సాక్ష్యాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ అయిన జావెద్ అహ్మద్ కుమార్తె కూడా ఉన్నారని, ఆమె ఢిల్లీలో చదువుతోందని చెప్పారు. ఇలాంటి కార్యకలాపాల్లో ఆమె పాల్గొంటోందని పేర్కొన్న అజయ్ కుమార్.. అవసరమైతే ఢిల్లీ పోలీసులను సంప్రదిస్తామని, తమ బృందాలను పంపిస్తామని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 68 మంది నిందితులను పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2022-06-11T21:46:35+05:30 IST