రొయ్య.. రయ్‌..

ABN , First Publish Date - 2022-08-20T07:01:23+05:30 IST

వనామీ చిన్న కౌంటు రొయ్యల ధరలు అదర గొడుతున్నాయి. వంద కౌంటు రూ. 300 నుంచి రూ.320 వరకు ధర పలుకుతున్నాయి.

రొయ్య.. రయ్‌..

భారీగా పెరిగిన ధరలు

చిన్న కౌంట్‌కు యమ గిరాకీ

వరదలతో చెరువులు నాశనం

రొయ్యల సప్లయి లేక రేట్లు పెంపు

ఆక్వా రైతుల్లో ఆనందం

గతంలో 60 కౌంట్‌ ధర ఇప్పుడు వంద కౌంట్‌కు లభ్యం


మలికిపురం, ఆగస్టు 19: వనామీ చిన్న కౌంటు రొయ్యల ధరలు అదర గొడుతున్నాయి. వంద కౌంటు రూ. 300 నుంచి రూ.320 వరకు ధర పలుకుతున్నాయి. స్థానిక మార్కెట్ల లో చిన్న రొయ్యలకు డిమాండు ఉం డడంతో 100 నుంచి 70 కౌంట్ల వరకు మంచి ధరలు లభిస్తున్నాయి. 30 నుంచి 50 కౌంట్ల వరకు రొయ్య లకు ఎగుమతి లేకపోవడంతో పెద్ద కౌంట్ల ధరలు పెరగలేదు. చిన్న కౌంట్లకు మాత్రం ఎక్కువ సరుకు ఉంటే మరింత రేటు పెంచి కొంటున్నారు. టన్ను పైబడి సరుకు ఉంటే ఎక్కువ రేటు ఇస్తున్నారు. మూడు టన్నుల పైబడి ఉంటే కిలోకి మరో రూ.20 పెంచుతున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా సానుకూలంగా లేకపోవడంతో చిన్న కౌంట్లలోనే చెరువులు దెబ్బతింటున్నాయి. అయినప్పటికీ మంచి ధర ఉండడంతో రైతుకు హుషారుగానే ఉంది. చిన్న కౌంట్లను హెచ్చు ధర పలకడంతో గతానికంటే టన్నుకు రూ.70 వేలు అదనంగా వస్తోంది. గత నెల రోజుల కిందట వంద కౌంటు రొయ్యలు రూ. 230 ధర పలుకగా, 90 కౌంటు రూ.240, 80 కౌంటు రూ.260, 70 కౌంటు రూ.290, 60 కౌంటు రూ. 310, 50 కౌంటు రూ.320, 40 కౌంటు రూ.355, 30 కౌంటు రూ.400 ధరలు ఉండేవి. ప్రస్తుతం ఆక్వా కల్చర్‌ ఎక్కువగా ఉండే నెల్లూరు వంటి ప్రాంతాల్లో గత నెల రోజులపాటు కురిసిన ముసురు వర్షాల కు ఆక్వా పంట నెల్లూరుతోపాటు పశ్చిమ, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో దెబ్బతిన్నాయి. ఎక్కడా రొయ్యలు అందుబాటులో లేవు. మన స్థానిక మార్కెట్లతోపాటు కేరళ, ముంబై, కోల్‌కతా వంటి మార్కె ట్లలో చిన్న రొయ్యలకు మంచి ధర పలుకుతోంది. వర్షాలు, వరదలు, అల్పపీడనం వంటి పరిస్థితులతో విబ్రియో వైరస్‌ వ్యాపించడంతో పంట దెబ్బతింది. సీడు నాణ్యమైంది కాకపోవడం, హేచరీలు ప్రమా ణాలు పాటించకపోవడం, రైతులు హడావుడిగా సీడు ఎంపికలో జాగ్రత్తలు వహించకుండా చెరువు లో వేయడంతో ఆదిలోనే దెబ్బతింటున్నారు. ప్రస్తుతం సరుకు లేకపోవడంతో వ్యాపారులు రొయ్యల ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వంద కౌంటు రూ.295 నుంచి సరుకు ఎక్కువగా ఉంటే రూ.300 నుంచి రూ.320 వరకు కొనుగోలు చేస్తున్నారు. 90 కౌంటు రూ.305 నుంచి రూ. 310, 80 కౌంటు రూ.325, 70 కౌంటు రూ.345, 60 కౌంటు రూ.355, 50 కౌంటు రూ.675, 40 కౌంటు రూ.400, 30 కౌంటు రూ.520 ధర పలుకుతున్నాయి. నెలరోజుల కిందట 60 కౌంటు రొయ్యలు అమ్మే ధర ఇప్పుడు 100 కౌంటుకు వస్తుంది. దీంతో రొయ్యలు ఉన్న రైతుల పంట పండినట్టేనని భావిస్తున్నారు. 

Updated Date - 2022-08-20T07:01:23+05:30 IST