రైతుబంధు భూస్వామ్యబంధు అయింది: ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-03-18T02:21:29+05:30 IST

సీఎం కేసీఆర్‌ మాటలు, నీటి మూటలు అయ్యాయని, రైతుబంధు పథకం భూస్వామ్యబంధుగా మారిందని బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌

రైతుబంధు భూస్వామ్యబంధు అయింది: ప్రవీణ్‌కుమార్‌

మోత్కూరు: సీఎం కేసీఆర్‌ మాటలు, నీటి మూటలు అయ్యాయని, రైతుబంధు పథకం భూస్వామ్యబంధుగా మారిందని బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రగతిభవన్‌ ఎదుట ఉన్న రోడ్డు కబ్జా చేశారని, ఫుట్‌పాత్‌ను తొలగించారని ఆరోపించారు. వారికో నీతి, ఇతరులకో నీతా అని ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ఇక వారి పప్పులు ఉడకవని హెచ్చరించారు. మోత్కూరు, అడ్డగూడూరు ప్రాంతాల నుంచి ఆధిపత్య వర్గాలు జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, రోజూ వందల లారీల ఇసుక తరలిస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. రాజ్యాంగంపై విశ్వాసం లేని వ్యక్తి పాలిస్తే పాలన ఇలానే ఉంటుందన్నారు. ఇది కాంట్రాక్టర్ల ప్రభుత్వమని, ప్రజల ప్రభుత్వం కాదని ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. 

Updated Date - 2022-03-18T02:21:29+05:30 IST