మరో శ్రీలంకగా తెలంగాణ: ప్రవీణ్ కుమార్

ABN , First Publish Date - 2022-04-18T20:23:41+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తుందని బీఎస్పీ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

మరో శ్రీలంకగా తెలంగాణ: ప్రవీణ్ కుమార్

ఖమ్మం: టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తుందని బీఎస్పీ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో పర్యటించారు. ఈసందర్భంగా  ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో చర్చించడానికే బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టినట్లు తెలిపారు.అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. దళితులను దగా చేయడానికే దళిత బంధు పథకం తీసుకొచ్చారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సీఎం కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు.అధికారం భూస్వాములు, పెట్టుబడి దారుల చేతుల్లోనే ఉందని చెప్పారు. యాసంగిలో పంటలు సాగు చేయని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఏడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.

Updated Date - 2022-04-18T20:23:41+05:30 IST