ఏలేశ్వరం, జనవరి 26: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అత్యధిక సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటుదామని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని తిరుమాలి గ్రామంలో మర్రివీడు, తూర్పులక్ష్మీపురం, లింగంపర్తి, భధ్రవరం, పేరవరం, సి.రాయవరం తదితర పలు గ్రామాల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో పోటీచేసే సర్పంచ్, వార్డు సభ్యులైన అభ్యర్థుల ఎంపిక, వారి విజయం కోసం అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాల్లో నాయకులు పైల సుభా్‌ష చంద్రబోస్, సూతి బూరయ్య, పసల సూరిబాబు, జిగటాపు సూరిబాబు, మైరాల కనకారావు, పలివెల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.