రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-07-28T05:36:59+05:30 IST

ఏలేశ్వరం, జూలై 27: గోతులతో అఽధ్వాన్నంగా మారిన రహదారులను ఆధునీకరించి ప్రమాదాలు నివారించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వరుపుల తమ్మయ్యబాబు విమర్శించారు. మండల పరిధిలోని లింగంపర్తి శివారు నుంచి పే

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రభుత్వం విఫలం
లింగంపర్తి-పేరవరం రోడ్డులో శ్రమదానంతో గోతులను పూడుస్తున్న నాయకులు

జనసేన ప్రత్తిపాడు ఇన్‌చార్జ్‌ తమ్మయ్యబాబు 

ఏలేశ్వరం, జూలై 27: గోతులతో అధ్వాన్నంగా మారిన రహదారులను ఆధునీకరించి ప్రమాదాలు నివారించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వరుపుల తమ్మయ్యబాబు విమర్శించారు. మండల పరిధిలోని లింగంపర్తి శివారు నుంచి పేరవరం గ్రామం మీదుగా యర్రవరం జాతీయ రహదారి వరకు గోతులతో శిథిలావస్థకు చేరిన 5కిలో మీటర్ల మేర ప్రధాన రహదారి అధ్వాన్న దుస్థితిపై మంగళవారం జనసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తమ్మయ్యబాబు పేరవరం, భద్రవరం తదితర గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులతో కలసి రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం శ్రమదానంతో గోతులను గ్రావెల్‌తో పూడ్చివేసి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ఈ తారురోడ్డు శిథిలమై ప్రమాదాలకు నిలయంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దమ్ముచట్రాలతో ట్రాక్టర్లు రోడ్డుపై ప్రయాణించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అవసరాల సూ ర్యప్రకాష్‌, పెంటకోట చంటిబాబు, డేగల సత్తిబాబు, రాజమాని సూరిబాబు, బాల, యడగల దుర్గ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T05:36:59+05:30 IST