Fashion designer Prathyusha ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2022-06-12T18:03:31+05:30 IST

ప్రత్యూష (Prathyusha) ఆత్మహత్య (suicide) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Fashion designer Prathyusha  ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

Hyderabad: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష (Prathyusha) ఆత్మహత్య (suicide) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు ముందు సెల్ఫీవీడియో (Selfie video) తీసుకున్నట్లు సమాచారం. తన పరిస్థితి మొత్తం స్నేహితులకు షేర్ చేసినట్లు తెలియవచ్చింది. ప్రముఖ హీరోయిన్‌తో ప్రత్యూష చివరిగా మాట్లాడినట్లు పోలీసులు (Police) గుర్తించారు. ప్రత్యూష సూసైడ్ లెటర్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. తాను కోరుకున్న జీవితం ఇది కాదంటూ.. అందుకే వెళ్లిపోతున్నానంటూ సూసైడ్ నోట్‌లో ఉంది. గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ప్రత్యూష ఉన్నట్లు సమాచారం. రూమ్‌లో కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్ని పోలీసులు గుర్తించారు. రసాయనం పొగ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. సూసైడ్ లెటర్, పెన్‌డ్రైవ్, మొబైల్‌ను సీజ్ చేశారు. కాగా ఉస్మానియా హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం పూర్తి అయింది. అనంతరం ప్రత్యూష మృతదేహాన్ని అపోలో ఆస్పత్రికి  తరలించారు. సోమవారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


కాగా ప్రత్యూష స్వస్థలం విజయవాడ. ఈ ఏడాదే హైదరాబాద్‌ వచ్చిన  ప్రత్యూష  బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12లో బొటిక్‌ ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం తాను బొటిక్‌ సెంటర్‌కు వెళుతున్నట్లు తల్లికి చెప్పి బయలుదేరారు. సాయంత్రం ప్రత్యూషతో మాట్లాడదామని ఆమె తల్లి పలుమార్లు ఫోన్‌ చేయగా కలవలేదు. శనివారం ఉదయం కూడా ఫోన్‌ కలవకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ప్రత్యూష గురించి ఆమె స్నేహితుల వద్ద ఆరా తీయగా తమ వద్దకు రాలేదని చెప్పారు. అందరూ కలిసి బొటిక్‌ కేంద్రానికి వెళ్లి వాచ్‌మన్‌ను అడిగారు. రాత్రి నుంచి ఆమె లోపలే పడుకొని ఉన్నారని వాచ్‌మన్‌ చెప్పాడు. అనంతరం వారు తలుపులు పగులకొట్టి చూడగా.. బాత్‌రూం తలుపు తెరవగానే లోపలి నుంచి ఒక్కసారిగా విషవాయువు వెలువడింది. బంధువులు, స్నేహితులు ఉక్కిరిబిక్కిరై బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటికి మళ్లీ వెళ్లి చూడగా బాత్‌రూంలోనే ప్రత్యూష విగతజీవిగా పడి ఉన్నారు.  ఘటనాస్థలి నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ ద్రావణం డబ్బాను, టేబుల్‌పై సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-06-12T18:03:31+05:30 IST