ప్రతాపరెడ్డి వైసీపీ వాడే!

ABN , First Publish Date - 2020-10-01T08:00:55+05:30 IST

వైసీపీలో తిరుగుతున్న వ్యక్తికి టీడీపీ ముద్ర ఎలా వేస్తారని డీజీపీ గౌతం సవాంగ్‌ను తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు...

ప్రతాపరెడ్డి వైసీపీ వాడే!

  • ఆయనకు టీడీపీ ముద్ర వేస్తారా?.. డీజీపీకి వర్ల ప్రశ్న


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): వైసీపీలో తిరుగుతున్న వ్యక్తికి టీడీపీ ముద్ర ఎలా వేస్తారని డీజీపీ గౌతం సవాంగ్‌ను తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘దళిత న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి చేసింది వైసీపీ వ్యక్తులు. అందులో ప్రతాపరెడ్డి టీడీపీకి చెందినవాడు అంటూ డీజీపీ మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతాపరెడ్డి తల్లికి టీడీపీ టికెట్టు ఇచ్చింది. ప్రతాప రెడ్డి వైసీపీతో కుమ్మక్కై ఆమె నామినేషన్‌ను ఉపసంహరింపచేసి అక్కడ వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడానికి సహకరించాడు. అప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డితో తిరుగుతున్నారు. ఆయన టీడీపీ వ్యక్తి ఎలా అవుతారో డీజీపీ చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి పెద్దిరెడ్డిలను సంతృప్తిపర్చడానికి డీజీపీ లేఖలు రాయడం బాధాకరం’ అని వర్ల అన్నారు. పోలీస్‌ అధికారుల సంఘం కూడా స్పందించాల్సిన చోట స్పందించాలని సూచించారు.

Updated Date - 2020-10-01T08:00:55+05:30 IST