May 11 2021 @ 13:19PM

'జాంబి రెడ్డి' సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ వర్మ..!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'జాంబి రెడ్డి'కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. రీసెంట్‌గా వచ్చిన ఇందులో తేజా సజ్జా, ఆనంది, దక్ష నగర్కార్ ప్రధాన పాత్రల్లో నటించారు. హర్రర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాతో ప్రశాంత్ వర్మకు మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. స్క్రిప్ట్ కూడా దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. కరోనా ఉధృతి తగ్గగానే ప్రాజెక్ట్ పట్టాలె క్కించాలని సన్నాహాలు చేస్తున్నారట. దర్శకుడిగా 'అ', 'కల్కి' సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ 'జాంబి రెడ్డి'తో మరింత పాపులర్ అయ్యాడు. కాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 'జాంబి రెడ్డి' సీక్వెల్‌కు ముందు మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఈ దర్శకుడు నుంచి ఏ సినిమా ముందు పట్టాలెక్కుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.