కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2021-05-08T06:53:26+05:30 IST

కరోనా నివారణకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న అన్నారు.

కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు

 కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ 

చిట్టినగర్‌, మే 7: కరోనా నివారణకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న అన్నారు. కరోనా నివారణ చర్యలు, విధివిధానాలపై శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగర పరిధిలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ జరుగున్న వ్యాక్సినేషన్‌ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తుందీ లేనిదీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. నగరంలో 7 ప్రాంతాల్లో జరుగుతున్న కరోనా టెస్ట్‌లకు సంబంధించి ప్రత్యేక కార్యచరణ రూపొందించి దానికి అనుగుణంగా టెస్ట్‌లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్‌ను ఆదేశించారు. కా.మార్కెట్‌, రైతుబజార్లో, వివిధ మార్కెట్‌లలో రద్దీకి అనుగుణంగా డిసెంట్రాలైజ్‌డ్‌ చేసి దగ్గరలో అందుబాటులో గల స్కూల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇంటి వద్దనే కూరగాయలు అందుబాటులో ఉండేలా తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఉద్యాన శాఖ అధికారికి సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలపై చర్చిస్తూ, వాటిని ప్రతినిత్యం పర్యవేక్షించే బాధ్యతను ఎస్‌ఈకి అప్పగించారు. పాజిటివ్‌ కేసులు నమోదు ప్రాంతాల్లో ప్రత్యేక డిస్‌ఇన్ఫెక్షన్‌ హైపో క్లోరిన్‌ పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలని బయాలజి్‌స్టను ఆదేశించారు. నగరంలో కొవిడ్‌ మరణాలు అధిక సంఖ్యలో నమోదు కాబడుతున్న దృష్ట్యా  నగరపాలక సంస్థ శ్మశాన వాటికల్లో దహన సంస్కారాల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూడాలని ఈఈ ప్రాజెక్ట్‌ను ఆదేశించారు.  

 మాస్కులు, పీపీఈ కిట్‌ పంపిణీ

నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులకు క్రెడై సంస్థ నిర్వాహకులు ఎన్‌95 మాస్కులు-500, సర్జికల్‌ మాస్కులు-2000, 20 పీపీఈ కిట్‌లను శుక్రవారం నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటే్‌షను ఆయ ఛాంబర్‌లో కలిసి అందజేశారు.  



Updated Date - 2021-05-08T06:53:26+05:30 IST