వంగపండు విప్లవ కళా వారసత్వాన్ని కొనసాగిద్దాం

ABN , First Publish Date - 2020-08-07T10:29:40+05:30 IST

వంగపండు ప్రసాదరావు విప్లవ కళా వారసత్వాన్ని కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు.

వంగపండు విప్లవ కళా వారసత్వాన్ని కొనసాగిద్దాం

సంస్మరణ సభలో వక్తలు


గుజరాతీపేట: వంగపండు ప్రసాదరావు విప్లవ కళా వారసత్వాన్ని కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు.  ఇలిసిపురంలోని అంబేడ్కర్‌ విజ్ఞాన మందిరంలో వంగపండు సంతాప సభను గురువారం నిర్వహించారు. ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ,   ప్రజా కళా యోధుడు వంగపండు ఉద్యమ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపో తారన్నారు. విలువైన కళాకారుణ్ని భౌతికంగా కోల్పోవడం ఉత్తరాంధ్రకు తీరని లోటన్నారు. తొలుత వంగపండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సన్నశెట్టి రాజశేఖర్‌,  జిల్లా కమిటీ అధ్యక్షుడు మార్పు మల్లేశ్వ రరావు,  ప్రజా సంఘాల నాయకు లు తాండ్ర ప్రకాష్‌, కల్లేపల్లి రాంగో పాల్‌, మిస్క కృష్టయ్య, గణేష్‌, అప్పారావు, నీలంరాజు, కాంతి, కృష్ణవేణి, పద్మ, భాస్కరరావు, రాములు, తదితరులు పాల్గొన్నారు.


ఆమదాలవలస రూరల్‌: తన ఆటపాటలతో సామాన్యులను సైతం చైతన్యవంతులను చేసిన ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావుకు నివాళులరిస్తూ సైకత శిల్పం ద్వారా ఘనంగా నివాళుర్పించారు శిల్పి గేదెల హరికృష్ణ.  మండలంలోని గాజులకొల్లివలస సంగమేశ్వర ఆలయం వద్ద వేసిన వంగపండు సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంటోంది. వంగపండు ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా ఈ శిల్పం తీర్చిదిదినట్లు గేదెల హరికృష్ణ తెలిపారు.

Updated Date - 2020-08-07T10:29:40+05:30 IST