గాన గంధర్వుడికి నివాళులర్పించిన ప్రసాద్ తోటకూర!

ABN , First Publish Date - 2020-09-26T21:51:04+05:30 IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు తుదిశ్వాస విడిచిన విష

గాన గంధర్వుడికి నివాళులర్పించిన ప్రసాద్ తోటకూర!

డల్లాస్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తానా పూర్వాధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. అంతేకాకుండా ఎస్పీబీతో ఉన్నఅనుబంధాన్ని ప్రసాద్ తోటకూర.. గుర్తు చేసుకున్నారు. ‘2012లో నేను తానా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆష్టిన్‌లో విశ్వవిద్యాలయ స్థాయి తెలుగు భోదన కోసం విరాళాల సేకరించాం. విరాళసేకరణలో భాగంగా డల్లాస్‌లో ఓ సంగీత విభావరిని ఏర్పాటు చేయాలని భావించి.. బాలును సంప్రదించాను. దానికి ఆయన సానుకూలంగా స్పందించి.. ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ, చిత్ర తదితర సింగర్లతో ఓ అద్భత కార్యక్రమానికి తోడ్పడ్డారు’ అని చెప్పారు. అనంతరం వారికి తమ ఇంట్లో ప్రత్యేక వింధు ఇచ్చినట్లు ప్రసాద్ తోటకూర గుర్తు చేసుకున్నారు. 



2013 తానా మహాసభల సందర్భంగా అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలతో ఒక ప్రత్యేక పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఏర్పటు చేయడానికి ఎస్పీబీ సహకరించినట్లు చెప్పారు. 18 మంది పిల్లలతో.. అమెరికాలో మొట్టమొదటి పాడుతా తీయగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వివరించారు. అమెరికాలోని డల్లాస్‌లో అతిపెద్ద మహాత్మాగాంధీకి విగ్రహ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించినందుకు.. ఎస్పీబీ తనను భుజం తట్టి ఆశీర్వదించినట్లు చెప్పారు. 


‘తెలుగంటే అపార గౌరవంతో, పాటంటే ప్రాణంగా, మంచి భాషా సౌందర్యంతో, అనేక చతురోక్తులతో, వేలాది పాటల అమృత గానంతో, విశ్వవ్యాప్తంగా, ప్రతి సంగీతాభిమాని హృదయమాన్ని దోచుకున్న గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు.. ఈ లోకాన్ని విడిచి మన మధ్య నుంచి వెళ్లి పోయినా ఆయన మనకందించిన వేలాది పాటలతో మన అందరి హృదయాలలో ఆయన చిరంజీవి. తెలుగు పాట, సంగీతం ఉన్నంతవరకు ఆయన పేరు ప్రతి ఇంటా వినపడుతూనే ఉంటుంది’ అని అన్నారు. 


Updated Date - 2020-09-26T21:51:04+05:30 IST