రైల్లో ప్రాంక్ చేసిన యువకుడు.. రెండేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు

ABN , First Publish Date - 2021-08-05T12:20:33+05:30 IST

ఇటీవలి కాలంలో త్వరగా పాపులర్ అవడం కోసం యువత ఎక్కువగా ప్రాంక్స్ చేస్తున్నారు. వీటివల్ల ఇతరులకు కలిగి

రైల్లో ప్రాంక్ చేసిన యువకుడు.. రెండేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు

మాస్కో: ఇటీవలి కాలంలో త్వరగా పాపులర్ అవడం కోసం యువత ఎక్కువగా ప్రాంక్స్ చేస్తున్నారు. వీటివల్ల ఇతరులకు కలిగి అసౌకర్యాన్ని కూడా ఒక్కో సందర్భంలో మర్చిపోతున్నారు. ఇలా పక్కవాళ్ల గురించి పట్టించుకోకుండా చెత్త ప్రాంక్ చేసిన యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఘటన రష్యాలో వెలుగు చూసింది. గతేడాది ఫిబ్రవరిలో ఫుల్లుగా ప్యాసింజర్స్‌తో ప్రయాణిస్తున్న ఒక మెట్రోరైలు ఎక్కాడా యువకుడు. ఆ రైలు కారోమాటులో నుంచి ఝాబోరోవ్‌కు వెళ్తోంది. ఈ రైలు ఎక్కిన యువకుడు కాసేపటికి విపరీతంగా దగ్గుతూ గుండె పట్టుకొని కింద పడిపోయాడు. ఆ సమయంలో కరోనా వైరస్ ప్రపంచాన్ని బాగా వణికిస్తోంది.


అప్పటికి చైనాతోపాటు ఇటలీ, రష్యాల్లో కరోనా కేసులు బాగా నమోదవుతున్నాయి. అలాంటి సమయంలో ఈ యువకుడు చేసిన ప్రాంక్‌ను నిజమే అని నమ్మిన ప్రయాణికులు.. రైలు ఆగీ ఆగగానే దానిలో నుంచి పరుగులు పెట్టారు. ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తర్వాత తెలిసింది ఇదంతా ఒక ప్రాంక్ అని. ఈ వీడియో అప్పట్లో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ప్రాంక్ చేసిన సదరు యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Updated Date - 2021-08-05T12:20:33+05:30 IST