సర్‌ప్రైజ్: బిజినెస్ మ్యాన్‌ని పెళ్లాడిన ప్రణీత

నటి ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘అమ్మో.. బాపుగారి బొమ్మో’ అనే పాట తర్వాత నుంచి అందరూ ఆమెని బాపుగారి బొమ్మ అని పిలవడం మొదలెట్టిన విషయం తెలిసిందే. కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి ప్రణీత నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేస్తూ.. అందరి నోళ్లలో నానుతూనే ఉంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిన ప్రణీత.. సడెన్‌గా ఓ బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ప్రణీత వివాహం.. బిజినెస్ మ్యాన్ నితిన్‌తో ఆదివారం(మే 30) జరిగినట్లుగా తెలుస్తుంది. నితిన్‌- ప్రణీత వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


అంతకు ముందు లాక్‌డౌన్‌లో చాలా మంది సెలబ్రిటీలు వివాహం చేసుకున్నారు. రీసెంట్‌గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా మ్యారేజ్ చేసుకుంది. చాలా కాలంగా మంచి ఆఫర్ల కోసం చూస్తున్న ప్రణీతకు అలాంటి అవకాశాలు రాకపోవడంతో.. ఇక వివాహం చేసుకుని.. కొత్త లైఫ్‌ని స్టార్ చేయాలని ఆమె నిర్ణయం తీసుకుంది. బిజినెస్ మ్యాన్ నితిన్‌ను కరోనా ప్రొటోకాల్ పాటిస్తూ.. అతి తక్కువ మంది సమక్షంలో ఆమె వివాహం చేసుకుంది. మరి వివాహం తర్వాత ఆమె సినిమాలు చేస్తుందో.. లేదో? అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో ప్రణీత నటిస్తున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి.
Advertisement