‘టిఎన్ఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం’

ABN , First Publish Date - 2022-05-05T16:13:31+05:30 IST

టీఎన్ఎస్ఎఫ్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని...

‘టిఎన్ఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం’

విశాఖ: టీఎన్ఎస్ఎఫ్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అరెస్టు చేసిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గు చేటని ప్రణవ్ గోపాల్ అన్నారు.

Read more