ఉన్నత విద్యను ప్రభుత్వం భ్రష్టు పట్టించింది: ప్రణవ్ గోపాల్

ABN , First Publish Date - 2020-09-30T17:53:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో 16 నెలలు గడుస్తున్నా..

ఉన్నత విద్యను ప్రభుత్వం భ్రష్టు పట్టించింది: ప్రణవ్ గోపాల్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో 16 నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ఉపకులపతులను ప్రభుత్వం నియమించలేదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్ విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయి ఉపకులపతులను నియమించుటలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విశ్వవిద్యాలయాలలో అవినీతిని, అక్రమాలను ప్రోత్సహిస్తూ.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపకులపతులను ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు.


క్రొత్త కోర్సులు, సిలబస్ విధి విధానాలను రూపొందించకుండానే నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని ప్రణవ్ గోపాల్ విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను భ్రష్టు పట్టించిందని, ఉన్నత విద్యపై అవగాహన లేకపోవడంతో.. ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిందన్నారు. కళాశాలల్లో విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రణవ్ గోపాల్ విమర్శించారు.

Updated Date - 2020-09-30T17:53:21+05:30 IST