ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగిన ప్రాణహిత

ABN , First Publish Date - 2022-08-11T04:01:41+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు ప్రాజెక్టుల్లో వరద నీటిని వదిలిపెట్టడంతో మండల సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహితనదికి వరద పోటె త్తింది.

ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగిన ప్రాణహిత
తలాయి- పాత సోమిని గ్రామాల మధ్య నీట మునిగిన వంతెన

- తలాయి, పాతసోమిని మధ్య వరదనీటిలో మునిగిన వంతెన

- జలదిగ్బందంలో మూడు గ్రామాలు

బెజ్జూరు/దహెగాం/పెంచికలపేట/సిర్పూర్‌(టి)/కౌటాల, ఆగస్టు 10: ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు ప్రాజెక్టుల్లో వరద నీటిని వదిలిపెట్టడంతో మండల సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహితనదికి వరద పోటె త్తింది. దీంతో తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రాణహిత నది బ్యాక్‌వాటర్‌ కారణంగా వందల ఎకరాల్లో పత్తిపంట నీట మునిగింది. వరదనీటి కారణంగా తలాయి, పాత సోమిని గ్రామాల మధ్య వంతెన పూర్తిగా నీటమునిగి రాకపోకలు నిలిచిపో యాయి. ప్రాణహితకు వచ్చిన వరదతో ఇప్పటికీ నాలుగుసార్లు సాగుచేసిన పత్తిపంట నీటమునగడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగుకోసం ఇప్పటికేవేల రూపాయలు ఖర్చుచేయగా ఆదిలోనే పంటలన్నీ నీటిపాలు కావడంతో పత్తిమొక్కలు పెరిగే అవకాశం లేకుండా పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్‌, పెంచికలపేట మండలంలోని మురళీగూడ, గెండెపల్లి, జిల్లెడ గ్రామాల్లో పత్తిపంటలు ప్రాణహిత బ్యాక్‌వాటర్‌లో నీటమునిగాయి. 

పారిగాంసమీపంలోని సిర్పూర్‌ (టి)-కౌటాల ప్రధానరోడ్డుపైగల వంతెన పైకి బ్యాక్‌వాటర్‌ చేరింది. దీంతోరాకపోకలు నిలిచిపోయాయి. హుడ్కిలి, జక్కాపూర్‌, పోడ్సా వెంకట్రావుపేట వద్ద వంతెనను ఆనుకుని పెన్‌గంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద పుష్కరఘాట్‌లు నీటిఉధృతిలో మునిగిపో యాయి. రైతులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-11T04:01:41+05:30 IST