ప్రాణహిత తీరం... శోక సంద్రం

ABN , First Publish Date - 2022-01-19T04:08:56+05:30 IST

కోటపల్లి మండలంలోని ఆల్గామ ప్రాణ హిత నదితీరం శోకసంద్రంగా మారింది. నదిలో ఈతకని వెళ్లిన ము గ్గురు విద్యార్థులు సోమవారం గల్లంతు కాగా మంగళవారం అం బాల విజయేంద్రసాయి(15), అంబాల వంశీ వర్దన్‌(18)ల మృతదే హాలు లభించాయి. మరో విద్యార్థి గారె రాకేష్‌ (16) ఆచూకీ కాన రాలేదు. తమ కొడుకులు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులై తమను సాకుతారని భావించిన తల్లిదండ్రుల ఆశలు గల్లంతయ్యా యి.

ప్రాణహిత తీరం... శోక సంద్రం
మృతదేహంపై వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ఇరువురు విద్యార్థుల మృతదేహాల వెలికితీత

లభించని మరొకరి ఆచూకీ 

కోటపల్లి, జనవరి 18: కోటపల్లి మండలంలోని ఆల్గామ ప్రాణ హిత నదితీరం శోకసంద్రంగా మారింది. నదిలో ఈతకని వెళ్లిన ము గ్గురు విద్యార్థులు సోమవారం గల్లంతు కాగా మంగళవారం అం బాల విజయేంద్రసాయి(15), అంబాల వంశీ వర్దన్‌(18)ల మృతదే హాలు లభించాయి. మరో విద్యార్థి గారె రాకేష్‌ (16) ఆచూకీ కాన రాలేదు. తమ కొడుకులు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులై తమను సాకుతారని భావించిన తల్లిదండ్రుల ఆశలు గల్లంతయ్యా యి. స్నానానికి వెళ్లి నదిలోతును అంచనా వేయకుండా ముందుకు వెళ్లడంతో రాకేష్‌, వంశీవర్దన్‌, విజయేంద్రసాయిలు నీట మునిగారు. సోమవారం గాలించినా ఆచూకీ లభించలేదు. 

మంగళవారం ఉదయం నుంచి రెస్య్కూటీంతోపాటు గజఈతగాళ్లు నదిలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అయితే ఘటన జరిగిన 24 గంటల తర్వాత ముందుగా విజయేంద్రసాయి మృతదేహాన్ని వెలికితీయగా, అనంతరం అంబాల వంశీవర్ధన్‌ శవం లభించింది. గల్లంతైన మరో విద్యార్ధి గారె రాకేష్‌ ఆచూకీ కానరాకపోగా చీకటి పడేంత వరకు నాలుగు బృందాలు గాలింపు చేపట్టాయి. అయినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌ ఆదేశాలతో కరీంనగర్‌ నుంచి స్పీడ్‌ బోటును తెప్పించారు. బుధవారం మరోమారు గాలింపు చేపడతా మని జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ పేర్కొన్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి మంచిర్యాల ఆర్డీవో వేణు,  చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐ నరేష్‌, తహసీల్దార్‌ గోవింద్‌నాయక్‌, సర్పంచు సంతోష్‌కు మార్‌, ఎంపీటీసీలు తిరుపతి, జేక శేఖర్‌, సర్పంచులు పెద్దింటి పున్నంచంద్‌, లక్ష్మణ్‌గౌడ్‌లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే నది నుంచి ఇరువురి శవాలు లభ్యం కావడంతో శవాలపై పడి వారి కుటుంబీకులు పెట్టిన రోదనలు పలువుర్ని కలిచివేశాయి.  ప్రా ణహిత నదిలో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలను మాజీ ఎంఎల్‌సీ పురాణం సతీష్‌కుమార్‌ పరామర్శించారు. ఎంపీపీ మంత్రి సురేఖరా మయ్య, వైస్‌ఎంపీపీ శ్రీనివాసరావు,  ప్రజాప్రతినిధులు ఉన్నారు. 

నది వద్దే నిరీక్షణ 

ప్రాణహిత నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు కావడం సోమ వారం చీకటి పడేంత వరకు జాలర్లు గాలింపు చేపట్టిన గల్లైంతన విద్యార్థుల జాడ కానరాకపోవడంతో వారి కుటుంబాలతోపాటు గ్రామస్తులు, పోలీసులు తెల్లవారే వరకు నది వద్దే నీరిక్షించారు.  చలి, ఈదురుగాలులకు వణుకుతూ పిల్లల జాడ కోసం నిరీక్షించారు. ఉన్నత చదువులు చదివి మమ్మల్ని ఆదుకుంటారనుకుంటే కనబడ కుండా పోయారంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ప్రాణహిత నదిలో మునిగి శవమయ్యాడని, అల్లారు ముద్దు గా పెంచుకున్న కుమారుడు అదృశ్యమయ్యాడంటూ విజయేంద్ర సాయి తల్లిదండ్రులు అంబాల రాజయ్య-మధునక్కలు రోదనలు పె ట్టారు. అలాగే ఉద్యోగం చేసి ఆదుకుంటాడనుకున్న తమ కుమారు డు వంశీవర్ధన్‌ కనబడకుండా పోయాడంటూ శవంపై పడి మృతుని తల్లిదండ్రులు అంబాల సమ్మయ్య-శంకరక్కలు విలపించారు. 

మునిగిన చోటే శవాలు లభ్యం 

ప్రాణహిత నదిలో గొల్లరేవు వద్ద నీటిలో విద్యార్థులు గల్లంతు కాగా మునిగిన చోటనే ఇరువురి శవాలు లభ్యమయ్యాయి. విద్యార్థు లు మునిగిన ప్రాంతం లోతైన మడుగు కావడంతో గల్లంతైన విద్యా ర్థులు నీటి అడుగు భాగంలో ఉంటారని గజఈతగాళ్లు భావించి వలలు వేయడంతో ఇరువురి శవాలు లభ్యమయ్యాయి.  లభ్యమైన శవాలను నది తీరంలోనే పంచనామా చేసి వైద్యాధికారిణి విజిత పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు బంధువులకు మృతదేహాలను అప్పగించారు.  రాకేష్‌ ఆచూకీ కానరాకపోగా వారి కుటుంబీకులు, బంధువులు నది ఒడ్డునే నిరీక్షించారు. 

ముమ్మరంగా సహాయక  చర్యలు 

ప్రాణహిత నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు ఘటన బయ టకు రావడంతో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ ఆదేశాలతో రెస్క్యూటీంతోపాటు గజఈతగాళ్లు, పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నదిలో గల్లంతైన 24 గంటల తర్వాత ఇరువురి శవాలు లభ్యం కాగా మరొకరి కోసం గాలింపు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. 

Updated Date - 2022-01-19T04:08:56+05:30 IST