డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-03T04:53:05+05:30 IST

డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ప్రమాదం

డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ప్రమాదం

ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలో బుధవారం లారీ అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి సంఘటనలో తృటిలో ప్రమాదం తప్పింది. షాద్‌నగర్‌ నుంచి పత్తి నింపుకుపోవడానికి ఆమనగల్లుకు లారీ వచ్చింది. ఇంజిన్‌ ఆగిపోవడంతో డ్రైవర్‌ లారీని శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిని పక్కన నిలిపివేశాడు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో లారీని స్టార్ట్‌ చేసే క్రమంలో డ్రైవర్‌ నిస్సార్‌ లారీ కిందికి వెళ్లాడు. అదే సమయంలో లారీ ముందుకు కదిలి డివైడర్‌పైకి దూసుకెళ్లి సూచిక బోర్డును ఢీకొని ఆగిపోయింది. ఎస్‌ఐ ధర్మేశ్‌, సిబ్బందితో అక్కడికి చేరుకొని లారీని పక్కకు తొలగించి గాయపడిన డ్రైవర్‌ నిస్సార్‌ను ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2020-12-03T04:53:05+05:30 IST